Corona BF.7: చైనాలో భయం భయం.. మారణహోమం సృష్టిస్తోన్న BF-7 వేరియంట్..
చైనాలో పరిస్థితి భయం..భయంగా ఉంది. అక్కడి ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ BF-7 చైనాలో మారణహోమం సృష్టిస్తోంది. సెకండ్, థర్డ్ వేవ్స్‌ను మించి కల్లోలం రేపుతోంది.
చైనాలో పరిస్థితి భయం..భయంగా ఉంది. అక్కడి ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ BF-7 చైనాలో మారణహోమం సృష్టిస్తోంది. సెకండ్, థర్డ్ వేవ్స్‌ను మించి కల్లోలం రేపుతోంది. కరోనా రోగులతో చైనాలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. హాస్పిటల్‌లో బెడ్ కోసం గంటలు, రోజులు తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అక్కడ. మరణించినవాళ్ల మృతదేహాలను భద్రపర్చేందుకు కూడా ఫ్రీజర్లు దొరకడం లేదంటే చైనాలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయొచ్చు.
BF-7 దెబ్బకు చైనీస్ వణికిపోతున్నారు. క్షణక్షణం భయం భయంతో బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఎవర్నీ వైరస్ ఎటాక్ చేస్తోందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రతిరోజూ వేలు లక్షల్లోనే కొత్త కేసులు నమోదవుతుండటం ఆ దేశాన్ని బెంబేలెత్తిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే BF-7 వేరియంట్ చైనాలో విలయతాండవం సృష్టిస్తోంది. BF-7 వేరియంట్ ఎక్కువగా వయోవృద్ధుల్లో స్ప్రెడ్ అవుతోందంటున్నారు నిపుణులు. ఇప్పుడు జరుగుతోన్న మరణాల్లో అధికంగా వయోవృద్ధులే ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయ్.
BF-7 వ్యాప్తి కూడా వయోవృద్ధుల్లోనే ఎక్కువగా ఉందంటున్నారు. ప్రతి హాస్పిటల్‌లో 90శాతం రోగులు కరోనా బాధితులే ఉంటున్నారు. షాంఘైలో అయితే స్ట్రెచర్లపైనే బాధితులకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. BF-7 ఉధృతికి, తాజా కల్లోలానికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కంప్లీట్ కాకపోవడం కూడా కారణమనే మాట వినిపిస్తోంది. అయితే, ఇది నిజం కాదంటోంది చైనా.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..