Corona in China: కోరి మరీ కరోనాను అంటించుకున్న చైనా సింగర్‌.. మండిపడుతున్న నెటిజన్లు..

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో భయపెడుతోంది. ఇండియాలోనూ కొత్త కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా...

Corona in China: కోరి మరీ కరోనాను అంటించుకున్న చైనా సింగర్‌.. మండిపడుతున్న నెటిజన్లు..
China Singer
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 22, 2022 | 7:31 PM

కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో భయపెడుతోంది. ఇండియాలోనూ కొత్త కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. లాక్ డౌన్, కఠిన నియమాలు అమలు చేసినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాకపోగా.. సిట్యువేషన్ అంతకంతకూ తీవ్రంగా మారుతోంది. కరోనా చేస్తున్న విలయతాండవాన్ని డ్రాగన్ దేశం విలవిల్లాడుతోంది. వందల సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్‌ మరింత ఉద్ధృతమై లక్షల్లో ప్రాణాలు పోవచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మహమ్మారినుంచి తప్పించుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతుంటే.. ఓ ప్రముఖ మహిళా సింగర్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ను అంటించుకుంది.

వచ్చే నూతన సంవత్సర వేడుకల్లో తను ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని. ఆ సమయంలో కరోనా వస్తే ఇబ్బంది.. అదేదో ఇప్పుడే వచ్చేస్తే ఓ పనైపోతుంది కదా అంటోంది. అందుకోసం వైరస్‌ సోకిన కొందరి ఇళ్లకు వెళ్లి నేరుగా వాళ్లను కలిసిందట. దాంతో ఆమెకు వైరస్‌ సోకిందట. దీంతో నూతన సంవత్సర వేడుకల నాటికి వైరస్‌ నుంచి కోలుకునేందుకు సమయం దొరికింది’ అంటూ జేన్‌ ఝాంగ్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించడంతో సోషల్‌మీడియాలో సదరు సింగర్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కథనాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు కూడా ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

చైనాలో ప్రమాదకరమైన బీఎఫ్‌.7 వేరియంట్‌ వణికిపోతోన్న వేళ.. ఓ సింగర్‌ ఇటువంటి ప్రకటన చేయడం వైరల్‌గా మారింది. ఆమె తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతోపాటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన జేన్‌ ఝాంగ్‌.. వెంటనే క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఆ పోస్టును తొలగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..