ఓ వైపు కరోనా, మరోవైపు వృద్ధ జనాభాతో డ్రాగన్ కంట్రీ తిప్పలు.. పెళ్లి చేసుకుని పిల్లలు కనండి మహాప్రభో అంటూ యువతకి వేడ్కోలు..
ఓ వైపు రోజు రోజుకీ పెరుగున్న చైనా వృద్ధాప్య జనాభా.. మరోవైపు తగ్గుతున్న జనాభా రేటు.. ఆ దేశ అధికారులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అక్కడ యువతకు ప్రేమించమని.. పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. అయితే.. యువత ప్రేమ, పెళ్లి పై తీవ్ర ఉదాసీనతతో ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా పుట్టినిల్లు చైనాలో యువత దాదాపు మూడు సంవత్సరాలుగా జీరో-కోవిడ్ విధానంతో అష్టకష్టాలు పడుతున్నారు. లాక్ డౌన్.. ఉపాధి కరువుతో ఆ దేశం మీద మాత్రమే కాదు.. ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరోనా వైరస్ గత మూడేళ్ళకు పైగా జీవిత ప్రణాళికలను దెబ్బతీయడంతో చైనీస్ యువత పెళ్లి, పిల్లలను వాయిదా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి అంటే సుదూరం పారిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితంలో ఆర్ధికంగా స్థిరపడడం, పెళ్లి, పిల్లను కనడం, పెంచడం కష్టంగా భావిస్తున్నారు. అంతగా కరోనా మహమ్మారి ఆ దేశ ఆర్ధిక పరిస్థితి డ్రాగన్ కంట్రీ యువత ఆశలను నాశనం చేసింది మరి.
ఓ వైపు రోజు రోజుకీ పెరుగున్న చైనా వృద్ధాప్య జనాభా.. మరోవైపు తగ్గుతున్న జనాభా రేటు.. ఆ దేశ అధికారులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అక్కడ యువతకు ప్రేమించమని.. పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. అయితే.. యువత ప్రేమ, పెళ్లి పై తీవ్ర ఉదాసీనతతో ఉన్నట్లు తెలుస్తోంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. కొత్తగా పెళ్లయిన జంటల సంఖ్య 2021లో కూడా భారీగా తగ్గింది. గత ఏడాది పెళ్లి చేసుకున్న జంటల సంఖ్య 7.64 మిలియన్లకు పడిపోయింది. 1985లో పెళ్లి చేసుకున్న డేటా విడుదలైనప్పటి నుండి అంటే గత ఎనిమిది సంవత్సరాల్లో అత్యల్పంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2022 మొదటి మూడు త్రైమాసికాల్లో.. చైనాలో వివాహం కోసం నమోదు చేసుకున్న జంటల సంఖ్య 5.4 మిలియన్ల మాత్రమేనని చైనీస్ దినపత్రిక నివేదించింది. అంతేకాదు చైనాలో మొదటి వివాహానికి సగటు వయస్సు కూడా 2010లో 24.89 ఉండగా 2020లో వివాహ వయసు 28.67కి పెరిగింది.
చైనీస్ యువత వివాహానికి ఎందుకు దూరంగా ఉంటున్నారంటే..
ఇంటి నిర్వహణ ఖర్చులు , నిరుద్యోగం వంటి స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది యువతీయువకులు వివాహానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు చైనాలో మహిళలు ఇప్పటికే ఉన్నత విద్యను అభ్యసించడానికి.. పట్టణీకరణ నేపథ్యంలో మొదటి వివాహానికి ఆలస్యం చేస్తున్నారు. యూనివర్శిటీ డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న చదువున్న మహిళలకు, అవివాహితుల సంఖ్య చాలా రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది.
అంతేకాదు కరోనా వైరస్ కూడా చాలామంది యువతీయువకుల ఆలోచనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కోవిడ్ చాలా మంది చైనీయులను నిరుత్సాహానికి గురి చేసింది. దేశంలో కఠినమైన కోవిడ్ ఆంక్షలు.. లాక్‌డౌన్‌లు, క్వారంటైన్, మాస్ టెస్టింగ్ నియమాలు అలాగే కదలికలపై ఆంక్షలు అకస్మాత్తుగా సడలించారు. దీంతో కోవిడ్ -19 కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుదలకు దారితీసింది. ఒక నివేదిక ప్రకారం ఆ దేశంలో ఒక రోజులో 5 వేలమంది మరణించవచ్చు అని తెలుస్తోంది. యువత తమ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలు మసకబారినట్లు విశ్వసిస్తున్నారు.
చైనా సామాజిక నేపధ్యం కూడా పెళ్లిళ్లకు ఆలస్యానికి ఒక కారణంగా చెప్పవచ్చు. దాదాపు మూడు సంవత్సరాలుగా కోవిడ్-19 ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ దేశంలో పెళ్లి వేడుక అత్యంత విలాసవంతమైన వేడుక. వధూవరుల కుటుంబాలు ఒక జంటకు వివాహం భారీగా చేసుకుంటే తప్ప అక్కడ చాలామంది వివాహం చేసుకున్నట్లు పరిగణించరు. పెళ్లి చేసుకోకుండా దంపతులు సంతానం పొందలేరు.
అంతేకాదు ప్రధానంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వరులు.. తాము పెళ్లి చేసుకోవాలనుకున్న వధువుకు భారీగా ధర చెల్లించాలి. లేదంటే.. వధువు తమకు కాబోయే వరుడిని తిరస్కరిస్తుంది. కమ్యూనిస్ట్ పాలనలో ఇటువంటి సాంప్రదాయ పద్ధతుల పై ఆంక్షలు విధించి ఆధునిక వివాహాలను ప్రోత్సహించింది.. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ కన్యకు డబ్బులిచ్చే ఆచారం అలాగే ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు మార్గదర్శకాల ప్రకటించింది. పిల్లల పెంపకాన్ని ప్రోత్సహించే విధానాలను చైనా ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ప్రసూతి సెలవులను ఆప్టిమైజ్ చేసింది. అంతేకాదు నివేదికల ప్రకారం అధికంగా పబ్లిక్ చైల్డ్ కేర్ సేవలను అందిస్తోంది. అంతేకాదు ఒకటి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే జంటలకు ఉచిత ఇళ్లను గిఫ్ట్ గా అందిస్తోంది. నర్సింగ్ సౌకర్యాలను అందించడం తో పాటు..బీమాకు సంబంధించిన నియమాలను కూడా మెరుగుపరిచింది. పిల్లలకు ఆధునిక నాణ్యత విద్యను అందించేలా ప్రోత్సాహకాలను అందిస్తోంది. జంటలు పిల్లలను కనేలా తగిన సదుపాయాలను వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..