ఒకవైపు కరోనా ఆందోళన.. మళ్లీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం

సాధారణంగా సాగిపోతున్న మానవుల జీవితాల మధ్య కొత్త కొత్త వైరస్ లు పుట్టుకురావడం కలకలం సృష్టిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన కరోనా వైరస్ ఇంకా మనల్నీ వీడలేదు.

ఒకవైపు కరోనా ఆందోళన.. మళ్లీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం
Bird Flu
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:14 PM

సాధారణంగా సాగిపోతున్న మానవుల జీవితాల మధ్య కొత్త కొత్త వైరస్ లు పుట్టుకురావడం కలకలం సృష్టిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన కరోనా వైరస్ ఇంకా మనల్నీ వీడలేదు. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ వివిధ దేశాల్లో ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయితే ఇప్పడు తాజాగా బర్డ్ ఫ్లూ కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిలీ అనే దేశంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూను 53 ఏళ్లున్న ఓ వ్యక్తిలో గుర్తించినట్లు ఆ దేశ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అతనికి తీవ్రమైన ఇన్ ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నామని పరిస్థితి స్థిరంగానే ఉందని పేర్కొంది. మరోవైపు చిలీ ప్రభుత్వం ఈ వైరస్ ఎలా వ్యాపించింది అనేదానిపై పరిశోధన జరుపుతోంది.

అలాగే బర్డ్ ఫ్లూ సోకిన ఆ వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారిని కూడా చిలీ ప్రభుత్వం ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది చిలీలో కొన్ని జంతువుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇటీవల అక్కడ పౌల్ట్రీ ఎగుమతులు కూడా ఆగిపోయాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షుల లేదా జలచర జీవుల నుంచి మనుషులకు సోకుతుందని చిలీ వైద్యాధికారులు వెల్లడించారు. కానీ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ బర్డ్ ఫ్లూ కేసులు అర్జెంటీనా, 14 లాటిన్ అమెరికా దేశాల్లో కూడా వెలుగుచూశాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వేడార్ లోని మొదటిసారిగా ఓ 9 ఏళ్ల బాలికకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి