Luck: ఇతను అండీ సుడిగాడు.. నక్కతోక తొక్కాడు.. దొరికిన రాయి.. కోటి తెచ్చింది..
ఆ దొరికిన రాయి సుమారు 4 నుంచి 5 లక్షలు ఉంటుందేమో అనుకున్నాడు. కానీ వ్యాపారి వద్దకు వెళ్లాక అతడు చెప్పిన రేటు విని ఎగిరి గంతేశాడు.
అది ఆస్ట్రేలియా దేశం. అది బెండిగో – బల్లారత్ పట్టణాల మధ్య “గోల్డెన్ ట్రయాంగిల్” అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో బంగారం నిధులు ఉన్నాయి. బాగా లక్ ఉన్నవాళ్లకి అక్కడ గోల్డ్ దొరికిన దాఖలాలు ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు సెర్చింగ్ కొనసాగించినా కొందరికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి.. ఓ చౌకైన మెటల్ డిటెక్టర్‌తో ఆ ఏరియాలో గోల్డ్ కోసం అన్వేషణ సాగించాడు. అతడిని చూసి.. పలువురు నవ్విపోయారు. ఏంటి.. దాంతో బంగారం కనిపెడదామనే.. అని ఎగతాళి చేశారు. అయినా అతడు తన ప్రయత్నం ఆపలేదు.
అలా వెతుకుతూ ఉండగా.. ఓ రోజు ఓ చోట మెటల్ డిటెక్టర్ నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే ఆ ఏరియాలో తవ్వగా.. సుమారు నాలుగున్నర కేజీల ఉన్న ఓ రాయి కనిపించింది. దాని రంగు చూసి.. అందులో ఎంతో కొంత బంగారం ఉంటుందని అనుకున్నాడు. ఓ నాలుగైదు లక్షలైనా ముడతాయని ఆశపడ్డాడు. వెంటనే ఆ రాయిని తీసుకుని.. ఓ బంగారం వ్యాపారి దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు. దాన్ని పరిశీలించి.. ఆ వ్యాపారి బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటంటే.. ఆ రాయి ప్యూర్ గోల్డ్. 4.6 కేజీల బరువు ఉన్న ఆ రాయిలో సుమారు 2.6 కిలోల బంగారం ఉంది. దాని విలువ లక్షల కాదు సుమీ.. కోట్లు. అవును.. ఏకంగా.. కోటి 30 లక్షల రూపాయలకు దాన్ని డారెన్ క్యాంప్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆ వ్యాపారి తెలిపాడు. ఆ బంగారం దొరికిన వ్యక్తి తన పేరును వెల్లడించానికి ఇష్టపడలేదు. (Source)
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం