Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. బ్యాంక్ సీఈవో దుర్మరణం!
అమెరికాలోని దక్షిన కాలిఫోర్నియాలో శుక్రవారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈవో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిన కాలిఫోర్నియాలోని నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫెడెరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కుమారుడుతోపాటు..
అమెరికాలోని దక్షిన కాలిఫోర్నియాలో శుక్రవారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈవో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిన కాలిఫోర్నియాలోని నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫెడెరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కుమారుడుతోపాటు మరికొందరితో కలిసి యూరోకాప్టర్ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా శాన్ బ్రెనార్డినో కౌంటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి హెలికాఫ్టర్ కుప్పకూలింది. శనివారం నాటికి అందులో ప్రయాణించిన వారిలోఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.
ఈ దుర్ఘటనలో సీఈవో హెర్బర్ట్ విగ్వే మరణించినట్లు నైజీరియన్ ఎక్స్‌ఛేంజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ అబింబోలా ఒగున్‌బాంజోతో పాటు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో ధృవీకరించారు. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూపు మాజీ ఛైర్మన్ అబింబోలా, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. సమీపంలోని ఐ-15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని గమనించి 911కు కాల్ చేశారు. ప్రమాదంపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది.
పామ్ స్ప్రింగ్స్ విమానాశ్రయం నుంచి KABC-TV హెలికాప్టర్ రాత్రి 8:45 గంటలకు నెవాడాలోని బౌల్డర్ సిటీకి బయలుదేరింది. బౌల్డర్ సిటీ లాస్ వెగాస్‌కు ఆగ్నేయంగా 26 మైళ్లు (41 కిలోమీటర్లు) దూరంలో ఉంది. హెలికాఫ్టర్ కుప్పకూలిన సమయంలో అక్కడ మంచు కురుస్తున్నట్లు సమాచారం.
కాగా హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. నైజీరియా ‘యాక్సెస్ బ్యాంక్’ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలు అందిస్తోంది. కాగా ఇటీవలే అమెరికాలోని శాన్ డియాగో వద్ద US మెరైన్ కార్ప్స్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమదంలో ఐదుగురు మెరైన్లు చనిపోయారు. ఇది జరిగిన మూడు రోజులకే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.