AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలన నిర్ణయం తీసుకున్న బ్రిటన్ యువరాజు హ్యారీ.. రాచరికపు మర్యాదలను వదలుకుంటున్నట్లు వెల్లడి

బ్రిటన్ యువరాజు హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం రాచరికాన్ని వదులుకున్నారు. తనకు దక్కుతున్న అన్ని రాచరికపు గౌరవ మర్యాదలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు.

సంచలన నిర్ణయం తీసుకున్న బ్రిటన్ యువరాజు హ్యారీ.. రాచరికపు మర్యాదలను వదలుకుంటున్నట్లు వెల్లడి
prince harry and meghan markle
Balaraju Goud
|

Updated on: Feb 19, 2021 | 8:41 PM

Share

Prince Harry lose all honorary titles : బ్రిటన్ యువరాజు హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం రాచరికాన్ని వదులుకున్నారు. తనకు దక్కుతున్న అన్ని రాచరికపు గౌరవ మర్యాదలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనకు సంక్రమించిన మిలటరీ పదవులు, ఇతర పదవులు అన్నింటిని కాదనకుని తన భార్య మేఘన్ మార్కెల్‌తో వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు తన నిర్ణయాన్ని బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 కి తెలియజేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది.

తాను, తన భార్య మేఘన్ మార్కెల్ ఇకపై రాయల్ ఫ్యామిలీగా రాబోమని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ససెక్స్ యువరాజు, యువరాణిగా పేరుపొందిన ఆ ఇద్దరు ఏడాది క్రితం రాచరిక విధుల నుంచి తప్పుకోవడం పెద్ద సంచలనానికి దారి తీసింది. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ కొన్ని కమర్షియల్ వెంచర్స్ స్థాపించి తమకు నచ్చిన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2020 ప్రారంభంలో దీనికి సంబంధించి తొలి అడుగు పడింది. అప్పుడు బ్రిటన్ రాణితో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అయితే, వారు ఏడాది తర్వాత తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని చెప్పారు. ఇప్పుడు తాము ముందుకు వెళ్లడానికే సిద్ధపడ్డామని, రాచరికం వద్దని తేల్చి చెప్పారు హ్యరీ, మేఘన్.

‘మేం ఇకపై రాయల్ ఫ్యామిలీ మెంబర్స్‌గా రాబోం అని వారు మహారాణికి వారు తెలియజేశారు.’ అని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. వారు రాచకుటుంబం నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు ప్రకటించడంతో వారు రాయల్ ఫ్యామిలీ బాధ్యతలను కూడా నిర్వహించడం సాధ్యం కాదని బ్రిటన్ రాణి రాశారు. ‘రాయల్ ఫ్యామిలీ గౌరవాలు, మిలటరీ గౌరవాలు అన్నీ తిరిగి మహారాణికి అప్పగించేశారు.’ అని స్పష్టం చేశారు.

మాజీ సైనికుడు అయిన ప్రిన్స్ హ్యారీ మిలటరీలో కొన్ని పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరికొన్ని గౌరవ పదవులను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. ఇక, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ కూడా తనకు ఉన్న గౌరవ పదవులను కూడా వదులుకున్నారు. మరోవైపు, మేఘన్ మార్కెల్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఇంటర్వ్యూను అమెరికన్ ఫేమస్ షో ఓఫ్రా విన్ ఫ్రే షోలో ప్రసారం కానుంది.

ఇదీ చదవండి… Nasa Perseverance rover: మార్స్‌పైకి ‘నాసా’ రోవర్.. అరుధైన విజయం వెనుక భారత సంతతి సైంటిస్ట్ ఉన్నారని మీకు తెలుసా..?