Nasa Perseverance rover: మార్స్‌పైకి ‘నాసా’ రోవర్.. అరుధైన విజయం వెనుక భారత సంతతి సైంటిస్ట్ ఉన్నారని మీకు తెలుసా..?

Photos of Mars: మార్స్‌పైకి రోవర్‌ ఇలా వెళ్లిందో లేదో.. అలా అక్కడ వాతావరణం ఎలా ఉందో క్యాప్చర్ చేసేసింది పెర్సీ. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..

Nasa Perseverance rover: మార్స్‌పైకి ‘నాసా’ రోవర్.. అరుధైన విజయం వెనుక భారత సంతతి సైంటిస్ట్ ఉన్నారని మీకు తెలుసా..?
Follow us

|

Updated on: Feb 19, 2021 | 10:02 PM

Photos of Mars: మార్స్‌పైకి రోవర్‌ ఇలా వెళ్లిందో లేదో.. అలా అక్కడ వాతావరణం ఎలా ఉందో క్యాప్చర్ చేసేసింది పెర్సీ. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. సాధించిన అరుదైన ఘనత ఇది. అరుణగ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించే దిశగా ముందడుగు వేసింది. మార్స్‌పై విజయవంతంగా అడుగుపెట్టింది పర్సవరన్స్‌ రోవర్‌. కొన్ని నెలల పాటు అక్కడ పరిశోధనలు చేపట్టి.. ఎడు అడుగుల లోతు వరకు తవ్వి రాళ్లు, మట్టిని సేకరించనుంది ఈ పెర్సీ రోవర్‌.

అయితే, ఈ అత్యాధునిక రోవర్ ప్రయోగం విజయంలో భారత సంతతికి చెందిన సైంటిస్ట్ కృషి చాలానే ఉందని చెప్పాలి. పెర్సీ అని పిలుచుకుంటున్న ఈ పర్సవరన్స్‌ నాసా పంపిన అతిపెద్ద, అత్యాధునికి రోవర్‌. ఈ ప్రయోగంలో భారతీయ సంతతికి చెందిన సైంటిస్ట్‌ స్వాతి మోహన్‌ కీలక బాధ్యతలు నిర్వహించారు. మొత్తం ప్రయోగానికి అత్యంత కీలకమైన నేవిగేషన్‌ అండ్‌ కంట్రోల్స్‌ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించారు. అంతేకాదు. లీడ్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గానూ ఉన్నారు. అలాగే జీఎన్‌సీకి, ఇతర బృందాలకు సంధానకర్తగా వ్యవహరించారు స్వాతి మోహన్‌.

అయితే, స్వాతి మోహన్‌కి‌ ఏడాది వయసున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. 9 ఏళ్ల వయసులోనే స్టార్ ట్రెక్ ప్రేరణ పొందారు. ఉన్నత చదువులు చదివిన స్వాతీ మోహన్.. కార్నెల్ నుంచి మెకానికల్, ఏరోస్పెస్ ఇంజీరింగ్ బీఎస్సీ చేశారు. ఆ తరువాత ఎరోనాటిక్స్‌లో ఎంఐటీ నుంచి ఎమ్ఎస్, పీహెచ్‌డీ పొందారు.

ఇదిలాఉంటే.. పెర్సీ రోవర్‌ సేకరించే శాంపిల్స్‌ను మరో వ్యోమనౌక భూమికి తీసుకొస్తుంది. ఈ పెర్సీ రోవర్‌..మార్స్‌పై విజయవంతంగా ల్యాండవడంతో కాలిఫోర్నియా పసడెనాలోని జెట్‌ ప్రొపల్సన్‌ ల్యాబొరేటరీలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి సిబ్బంది..ప్రయోగం సక్సెసవడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Also read:

Corona Cases: ఆ రాష్ట్రంలో కొత్తగా 5,427 పాజిటివ్‌ కేసులు నమోదు.. ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు

కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు సిద్ధమైన భారత్ బయోటెక్.. 45 దేశాలకు “కొవాగ్జిన్” సరఫరాకు ఏర్పాట్లు