Boris Johnson: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా.. మంత్రుల తిరుగుబాటుతో..
48 గంటల్లో 54 మంది మంత్రులు తిరుగుబాటు చేయడంతో దిక్కులేని పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పకున్నారు. జూన్ 6న జరిగిన పార్టీ అవిశ్వాస తీర్మానం నుంచి జాన్సన్ గట్టెక్కారు.
Boris Johnson resign as Britan PM: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. మంత్రుల తిరుగుబాటుతో పదవికి రాజీనామా చేయాలని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు. 48 గంటల్లో 54 మంది మంత్రులు తిరుగుబాటు చేయడంతో దిక్కులేని పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పకున్నారు. జూన్ 6న జరిగిన పార్టీ అవిశ్వాస తీర్మానం నుంచి జాన్సన్ గట్టెక్కారు. అయితే నెలరోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. అయితే కన్జర్వేటివ్ పార్టీలో 40 శాతం మంది బోరిస్ జాన్సన్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
బోరిస్ జాన్సన్ స్థానంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశముంది. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తికి రిషి సునాక్ అల్లుడు. తన సన్నిహితుడు క్రిస్ పించర్‌ను వివిధ ఆరోపణల నుంచి కాపాడారని బోరిస్ జాన్సన్‌పై ఆరోపణలు వచ్చాయి. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి విందులు నిర్వహించినందుకు కూడా జాన్సన్ వివాదాల్లో ఇరుక్కున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలని గత కొద్దిరోజులుగా బ్రిటన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. బ్రిటన్ ప్రధానిగా 2 సంవత్సరాల 349 రోజులు అధికారంలో కొనసాగారు బోరిస్ జాన్సన్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..