Boiling River: ఆ నదిలో అంతుపట్టని రహస్యం.. కాలు పెట్టారో అంతేసంగతలు.. ప్రపంచంలోనే వింత నది.. షాకింగ్ విషయాలు మీకోసం..!

Boiling River: ఈ ప్రపంచంలో వెలుగు చూడని వింతలు, విషేషాలు చాలానే ఉన్నాయడంలో ఏమాత్రం సందేహం లేదు. సమస్త ప్రాణకోటికి..

  • Shiva Prajapati
  • Publish Date - 5:16 pm, Tue, 6 April 21
Boiling River: ఆ నదిలో అంతుపట్టని రహస్యం.. కాలు పెట్టారో అంతేసంగతలు.. ప్రపంచంలోనే వింత నది.. షాకింగ్ విషయాలు మీకోసం..!
Hot River

Boiling River: ఈ ప్రపంచంలో వెలుగు చూడని వింతలు, విషేషాలు చాలానే ఉన్నాయడంలో ఏమాత్రం సందేహం లేదు. సమస్త ప్రాణకోటికి నిలయమైన ఈ భూమిపై వెలుగు చూడని మరెన్నో మిగిలే ఉన్నాయి. మనుషులైనా.. జంతువులైనా.. వృక్షాలైనా.. ఇతర ప్రకృతి సౌందర్యాలైనా.. నాగరిక సమాజం చూడనివి చాలానే భూమిపై ఉన్నాయి. అందుకే రోజూ ఏదోచోట ఒక వింత వెలుగు చూస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి వింత ఒకటి వెలుగు చూసింది. అది తెలిస్తే మీరు తప్పకుండా వావ్ అంటారు.

సాధారణంగా నది అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది. కొన్ని కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ ఉంటుంది. తగడానికి, జలచరాల మనుగడకు అనువుగా ఉంటుంది. నదిలో నీరు చల్లగా ఉంటుంది. వంటివి ఆలోచనలే వస్తాయి. కానీ, తాజాగా వెలుగు చూసిన నది దీనికి పూర్తి విభిన్నం అని చెప్పాలి. ఆ నదిలో నీరు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. అందులో జీవి కాదు కదా.. చిన్న క్రిమి కీటకాలు కూడా బతికేందుకు అవకాశం లేదు. ఆ నదిలో నీళ్లతో క్షణాల్లోనే అన్నం ఉడకబెట్టవచ్చు. ఒకవేళ మనిషి అందులో పడినట్లయితే.. వారిపని కూడా క్షణాల్లో ఖతం అని చెప్పాలి. మరి ఆ వింత నది ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన, భయానక నదులు అనేకం ఉన్నాయి. కానీ, అమెజాన్ అడవిలో ఒక నది ఉంది. ఈ నదిలో నీరు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. ఈ నదిని మరిగే నది(బాయిలింగ్ రివర్) అని పిలుస్తుంటారు. శాస్త్రవేత్తలు కూడా ఈ నదిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నదిలోని నీరు ఇలా మరగడానికి గల కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ బాయిలింగ్ రివర్‌ని 2011 లో ఆండ్రీ రౌజో కనుగొన్నారు. ఈ నదిని ‘మయనటుయకు’ అని కూడా పిలుస్తారు. ఈ నదిని కనుగొనడానికి ఆండ్రీ చాలా కష్టపడ్డాడు. ఈ నదిలో నీళ్లు 24 గంటలూ మరుగుతూనే ఉంటాయి. 200 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్ కలిగిన ఈ నది పొడవు 6.4 కిలోమీటర్లు, వెడల్పు 82 అడుగులు, 20 అడుగుల లోతు ఉంటుంది. ఈ నదిలోని వాటర్‌తో గుడ్లు, రైస్, ఇతర ఆహార పదార్థాలను క్షణాల్లో ఉడకబెట్టవచ్చు. అలాగే.. ఎవరైనా పొరపాటున అందులో పడినట్లయితే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయం అని ఈ నదిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు ఈనదిని ఎలా కనుగొన్నారంటే..
మరిగే నదిని కనుగొన్న ఆండ్రీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఆండ్రీ చిన్నగా ఉన్నప్పుడు అతని తాత మరిగే నది కథను తరచుగా చెబుతుండేవాడట. అలా ఆ నది గురించి తెలుసుకోవాలని మనసులో బలంగా నిశ్చయించుకున్నాడు ఆండ్రీ. అతను పెరగడంతో పాటు.. ఆ నది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అని తెలుసుకోవాలనే తపన కూడా పెరిగి పెద్దదయ్యింది. ఎలాగైనా ఆ నదిని కనుగొనాలని ఫిక్స్ అయ్యాడు. ఈ నది గురించి చాలా మందిని ఆరా తీశాడు. ఆండ్రీ పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో అమెజాన్ అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా అమెజాన్ అడవిలో మరిగే నదిని కనుగొనేందుకు వేట సాగించిన ఆండ్రీ.. చివరికి 2011లో తన లక్ష్యాన్ని సాధించాడు. మరిగే నదిని కనుగొన్ని ప్రపంచానికి దాని చిరునామాను పరిచయం చేశాడు.

అయితే, ఈ నదిలో నీరు 24 గంటలూ మరగడానికి గల కారణాలేంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. దాని రహస్యమేంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఉష్ణ బిలాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. అది కొద్ది వైశాల్యంలో మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా సుమారు 7 కిలోమీటర్లు పొడవు కలిగిన నది నిత్యం మరుగుతూ ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాల్సిందే.

Also read:

Tamil Nadu Assembly Election 2021 voting Live: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఆరుబయట అదరగొట్టిన ప్రి వెడ్డింగ్‌ షూట్ వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియో..:Pre wedding shoot goes viral video.