AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deer circles: వైరల్ గా మారిన జింకల సుడిగాలి చక్కర్లు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జింకల సుడిగుండం మీరెప్పుడైనా చూశారా? సుడిగుండం అంటే సముద్రంలో వస్తుంది.. నదిలో వస్తుంది.. ఇంకా చెప్పాలంటే గాలి సుడులు తిరుగుతుంది. మరి జింకలు సుడిగుండం ఏమిటి.. అనిపిస్తోందా?

Deer circles: వైరల్ గా మారిన జింకల సుడిగాలి చక్కర్లు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Deer Cercle
KVD Varma
|

Updated on: Apr 06, 2021 | 5:44 PM

Share

Deer circles:  జింకల సుడిగుండం మీరెప్పుడైనా చూశారా? సుడిగుండం అంటే సముద్రంలో వస్తుంది.. నదిలో వస్తుంది.. ఇంకా చెప్పాలంటే గాలి సుడులు తిరుగుతుంది. మరి జింకలు సుడిగుండం ఏమిటి.. అనిపిస్తోందా? అవును సముద్రంలో సుడిగుండంలా.. గాలి సుడులు తిరిగినట్టుగా జింకలూ వేగంగా తిరుగుతాయి. ఎందుకో తెలుసా? ఈ స్టోరీ చదవండి.

ఉత్తర రష్యాలోని కోలా పెన్సులలో ఓ ఫోటోగ్రాఫర్ కు చిక్కిన ఓ వీడియో దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒకటీ..రెండూ కాదు.. వందల సంఖ్యలో ఉన్న జింకలు గుండ్రంగా.. సుడిగాలిలా తిరుగుతూ కనిపించాయి.

సాధారణంగా ఉత్తర ప్రాంతంలో ఉండే జింకలు తమను తాము రక్షించుకోవడానికి తమ దగ్గరకు వస్తున్న శత్రువును కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తుంటాయట. ముఖ్యంగా తమ చిన్న పిల్లలను రక్షించుకోవడం కోసమే ఇలా వలయాకారంగా వేగంగా తిరుగుతాయట. మధ్యలో పిల్లలను ఉంచి వాటి చుట్టూ పెద్ద జింకలు గిర్రున తిరుగుతూ ఉంటాయి. అన్నిటిలోకి బలమైనవి బయట వరుసలో ఉంటాయి.  జింకల మీద దాడిచేసే వేటకుక్కలు, తోడేళ్ళు, పులులు వంటి జంతువులు మంద నుండి ఒక్కో జింకను విడదీయడానికి ప్రయత్నిస్తాయి. మంద నుంచి విడిపోయిన జింకను చుట్టి ముట్టి చంపి తింటాయి. అలా విడివిడిగా కాకుండా ఉండేందుకు.. పిల్లలు వెనుకబడిపోయి జంతువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో జింకలు ఇలా చేస్తాయి.

డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఈ జింకల వలయకార పయనం చూడటానికి ఎంతో చక్కగా ఉంది. దీంతో నెట్టింట్లో ఈ వీడియోకు విపరీతంగా లైక్ లు వస్తున్నాయి.

అన్నట్టు ఇంతకీ చెప్పలేదు కదూ.. ఇప్పుడు ఈ జింకలు అన్నీ ఒక్కసారిగా ఎందుకు అలా త్రిగుతున్నాయో తెలుసా? వాటిని ఏ జంతువూ వెంట బడలేదు. విషయం వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఒక వెటర్నరీ డాక్టర్ ఆ జింక పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి వెళ్లారట..అదండీ సంగతి!

Also Read: Boiling River: ఆ నదిలో అంతుపట్టని రహస్యం.. కాలు పెట్టారో అంతేసంగతలు.. ప్రపంచంలోనే వింత నది.. షాకింగ్ విషయాలు మీకోసం..!

Corona Alert : పెంపుడు జంతువులకూ కరోనా సోకే అవకాశం ఉందని నిర్ధారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!