Viral Video: తీయటి కన్నీళ్లకు సాక్ష్యమిదే.. వినికిడి లోపంతో పుట్టిన చిన్నారి.. తొలిసారి అమ్మమాట విని.. వీడియో చూస్తే కన్నీల్లు ఆగవు..
Viral Video: ఈ చిన్నారిని చూడండి.. ఎంత ముద్దుగా ఉన్నాడు.. వయసు సుమారు మూడు, నాలుగు నెలలు ఉంటుండొచ్చు. బంగారు వర్ణంలో..
Viral Video: ఈ చిన్నారిని చూడండి.. ఎంత ముద్దుగా ఉన్నాడు.. వయసు సుమారు మూడు, నాలుగు నెలలు ఉంటుండొచ్చు. బంగారు వర్ణంలో.. బోసినవ్వుతో.. ఆ అమ్మను తదేకంగా చూస్తున్నాడు. ముద్దులొలికే పసికందును చూస్తూ ఆ తల్లి కూడా మైమరిచిపోయింది. చిన్నారిని ఆడిస్తూ.. తమ భాషలో ఆ బిడ్డకు కబుర్లు చెబుతోంది. అమ్మ చెప్పే మాటలు జాగ్రత్తగా వింటున్న ఆ పసివాడు కూడా అందుకు తగిన ఆహాభవాలను వ్యక్తం చేస్తున్నాడు. సంతోషంతో నవ్వుతూ, మధ్య మధ్యలో ఏడుస్తున్నట్లుగా దుఃఖాన్ని అపుకోలేక.. కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నాడు.
అయితే, ఇక్కడ ఎవరూ గుర్తించని, తెలియని ఓ నిజం దాగివుంది. ఆ చిన్నారి పుట్టు చెవిటి. పుట్టుకతోనే వినికిడి శక్తి లేకపోవడంతో ఇప్పటి వరకు అమ్మనోటి మాట వినలేకపోయాడు. వైద్యులను సంప్రదించిన ఆ తల్లిదండ్రులు.. బాలుడి చెవికి వినికిడి యంత్రం పెట్టించారు. ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో మొదటిసారిగా అమ్మ చెబుతున్న కబుర్లు ఆ చిన్నారి వింటున్నాడు. తొలిసారి అమ్మమాట.. చెవిన పడటంతో.. చిన్నోడు మొహంలో చెప్పలేని ఆవేదన.. కళ్లలో దాచలేని ఆనందం.. ఒకేసారి సాక్షత్కరించాయి.
అమ్మ నోటి వెంట వచ్చే మాటలు వింటూ.. నవ్వు, బాధ, ఏడుపు, తన్నుకు వస్తోన్న దుంఖంతో.. ఓ పెద్ద మనిషిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా వీడియో తీసిన ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బుడ్డొడికి ఫిదా అయిపోతున్నారు. ఆ చిన్నారి హవభావాలు చూస్తే మనకు సైతం కన్నీళ్లు రాక మానవు. మరెందుకు ఆలస్యం ముద్దులొలికే ఆ చిన్నారి వీడియోను మీరూ చూసేయండి.
Video:
బరువు తగ్గడానికి లవంగం టీ హెల్ప్ అవుతుందా ? దీనివల్ల ఉండే ప్రయోజనాలెంటో తెలుసా.. ఎలా రెడీ చేయాలంటే..