బరువు తగ్గడానికి లవంగం టీ హెల్ప్ అవుతుందా ? దీనివల్ల ఉండే ప్రయోజనాలెంటో తెలుసా.. ఎలా రెడీ చేయాలంటే..

Clove Tea: భారతీయ సుగంధ ద్రవ్యాలు రుచిగా ఉండటమే కాకుండా కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మనం రోజూ వాడే మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం..

బరువు తగ్గడానికి లవంగం టీ హెల్ప్ అవుతుందా ? దీనివల్ల ఉండే ప్రయోజనాలెంటో తెలుసా.. ఎలా రెడీ చేయాలంటే..
Clove Tea
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2021 | 10:21 PM

Clove Tea: భారతీయ సుగంధ ద్రవ్యాలు రుచిగా ఉండటమే కాకుండా కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మనం రోజూ వాడే మసాల దినుసులలో అతి ముఖ్యమైనది లవంగం.. అయితే ఇది కేవలం వంటల్లో నే కాకుండా..బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది. లవంగం టీ రోజూ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో శోథ నిరోధకాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి ఇతర ఆరోగ్య వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అయితే దీనితో టీ కూడా రెడీ చేసుకోవచ్చు. మరీ దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.

లవంగం టీని రెడీ చేయడం..

కావల్సిన పదార్థాలు..

2 కప్పుల నీరు 4-5 లవంగాలు 1/2 అంగుళాల దాల్చిన చెక్క కర్ర 1/2 అంగుళాల అల్లం బెల్లం నిమ్మరసం

తయారు చేయు విధానం..

ఒక బాణాలిలో నీరు పోసి మరిగించాలి. నీరు వేడి అయిన తర్వాత వాటిని దించి కాస్తా చల్లార్చి అందులో సుమారు 4-5 లవంగాలు, తురిమిన అల్లం, దాల్చిన చెక్కలను అందులో కలపాలి. వాటిని నీటిలో సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి వడకట్టి ఒక టీస్పూన్ తేనే, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. అంతే లవంగం టీ రెడీ.

ప్రయోజనాలు..

ఈ మసాలా టీ మీ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యూజీనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ , విటమిన్ కె ఉంటాయి. ఇవి బాక్టీరియాతో పోరాడతాయి. జ్వరంను కూడా తగ్గిస్తాయి. చిగుళ్లు, పంటి నోప్పిని తగ్గిస్తాయి.

Also Read: మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరోతో కలిసి వస్తున్న ‘ఆర్జీవి దెయ్యం’..

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…