Israel Divorce Law: ఆ దేశంలో విడాకుల కోసం కోర్టుకు.. 8వేల సంవత్సరాల వరకూ దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు తీర్పు..
Israel Divorce Law: ప్రపంచంలో అనేక దేశాలు.. ఒకొక్క దేశానికి ఒకొక్క సంప్రదాయం.. ఒకొక్క రకమైన చట్టం.. వాటిల్లో భార్యాభర్తల విడాకులు చట్టం ఒకటి. అయితే విడాకులు తీసుకోవాలంటే భార్యకు..
Israel Divorce Law: ప్రపంచంలో అనేక దేశాలు.. ఒకొక్క దేశానికి ఒకొక్క సంప్రదాయం.. ఒకొక్క రకమైన చట్టం.. వాటిల్లో భార్యాభర్తల విడాకులు చట్టం ఒకటి. అయితే విడాకులు తీసుకోవాలంటే భార్యకు విడాకులు ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో భరణం చెల్లించడంలాంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్టి వెళ్లకూడాదంటూ ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాకి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్‌కి వ్యతిరేకంగా “స్టే-ఆఫ్-ఎగ్జిట్” ఆర్డర్‌ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా లక్ష రూపాయలు భరణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ కారణంగా హుప్పెర్ట్ ఇజ్రాయిల్ విడిచిపెట్టడానికి వీలు లేకుండా పోయింది. హుప్పెర్ట్ తన పిల్లల భవిష్యత్తు కోసం సుమారు 18 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ 8వేల సంవత్సరాల వరకు అంటే 31-12-9999 వరకూ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందట. కాగా బాధితుడు ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త. తనకు కోర్టు ఇచ్చిన తీర్పు పై హుప్పెర్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు..
Also Read: ఈరోజు ఈరాశివారు స్త్రీవలన ఆర్ధికంగా లాభం పొందుతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..