Taslima Nasreen: నిజాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్ నా అకౌంట్‌ను బ్లాక్ చేసింది.. రచయిత్రి తస్లీమా నస్రీమ్ వ్యాఖ్య..
Taslima Nasreen: గతకొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పలు చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో..
Taslima Nasreen: గతకొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పలు చోట్ల హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారన్న కారణంగా దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే ఈ దాడులపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతోన్న దాడులకు సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చేశారు. సదరు పోస్టులను పరిగణలోకి తీసుకున్న ఫేస్‌బుక్ ఆమె ఖాతాను ఏడు రోజులపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించారు తస్లీమా. ‘ఇస్లాంకు చెందిన కొందరు హిందువలు ఇళ్లు, దేవాలయాలపై దాడులకు దిగుతున్నారని నేను పోస్ట్ చేసినందుకే ఫేస్‌బుక్ నా అకౌంట్‌ను బ్లాక్ చేసింది. హనుమాన్ కాళ్ల వద్ద ఖురాన్‌ను ఉంచారన్న కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ పని చేసింది హిందువులుకాదు.. ఇక్బాల్ హుస్సేయిన్, కానీ ఇస్లాంకు చెందిన వారు మాత్రం ఈ విషయంపై సైలెంట్‌గా ఉన్నారు. ఇక్బాల్‌కు వ్యతిరేకంగా ఏం చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తస్లీమా అకౌంట్‌ను బ్యాన్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చి 16న, తస్లీమా ఫేస్‌బుక్ ఖాతాను 24 గంటల పాటు ఫేస్ బుక్ నిషేధించింది. ఆ సమయంలో తస్లీమా నస్రీమ్ బంగ్లాదేశ్‌లోని ఓ దుకాణం యజమాని జిహాదీని నియమించుకోలేదంటూ పోస్ట్ చేశారు. ఈ కారణంగానే ఆమె ఖాతాను బ్లాక్ చేశారు.
ఇక 2015లోనూ ఓసారి ఫేస్‌బుక్ తస్లీమా ఖాతాను బ్లాక్ చేసింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో హిందూవులపై దాడులను ప్రస్తావిస్తూ తస్లీమా 1993లో రాసిన ‘లజ్జా’ నవల వివాదాస్పదమైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. 1994లో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన తస్లీమా నస్రీమ్ అప్పటి నుంచి భారత్‌లోని ఢిల్లీలో నివసిస్తున్నారు.
Facebook has banned me for writing ” Islamists destroyed Bangladeshi Hindu houses & temples believing that Hindus placed Quran on Hanuman’s thigh. But when it was revealed that Iqbal Hossain did that, not the Hindus, Islamists were silent, said and did nothing against Iqbal…’
— taslima nasreen (@taslimanasreen) November 1, 2021
Also Read: Breaking: నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. అతడు ఎవరంటే..?
Naga Shaurya: హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులు..! పేకాట ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు
Sabyasachi Mukjerhee: బీజేపీ మంత్రి అల్టిమేటం.. మంగళసూత్రం యాడ్ ఉపసంహరణ..