AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలూచిస్తాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 30 మంది పాకిస్తానీ పారామిలిటరీ సిబ్బంది మృతి..!

బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో ఉన్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడి సంచలనంగా మారింది. ఈ దాడికి నిషేధిత వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. జివానీ ప్రాంతంలోని పన్వాన్ కోస్ట్ గార్డ్ బేస్‌ను పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో లక్ష్యంగా చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

బలూచిస్తాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 30 మంది పాకిస్తానీ పారామిలిటరీ సిబ్బంది మృతి..!
Bla Attack
Balaraju Goud
|

Updated on: Jul 04, 2026 | 10:40 AM

Share

బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో ఉన్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడి సంచలనంగా మారింది. ఈ దాడికి నిషేధిత వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. జివానీ ప్రాంతంలోని పన్వాన్ కోస్ట్ గార్డ్ బేస్‌ను పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో లక్ష్యంగా చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ దాడిని సునిశితంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఆత్మాహుతి వాహన ఆధారిత పేలుడు పరికరం (SVBIED) ఆపరేషన్‌గా పేర్కొంది.

బీఎల్‌ఏ ప్రతినిధి జియాండ్ బలూచ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారీ పేలుడుతో కోస్ట్ గార్డ్ శిబిరం తీవ్రంగా దెబ్బతిందని, అనంతరం తమ ఫతే స్క్వాడ్ సభ్యులు అన్ని వైపుల నుంచి దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 30 మందికి పైగా సిబ్బంది మరణించారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారని బీఎల్‌ఏ ప్రకటించింది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య పెరగవచ్చని కూడా ఆ సంస్థ పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన 43 సెకన్ల వీడియోను బీఎల్‌ఏ మీడియా విభాగం విడుదల చేసింది. అందులో పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కు శిబిరంలోకి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించి, అగ్నిగోళం ఎగసిపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి…

అయితే, బీఎల్‌ఏ వెల్లడించిన ప్రాణనష్టం వివరాలను పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ఘటనపై పాకిస్తానీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. దీంతో మృతులు, గాయపడిన వారి సంఖ్యపై స్వతంత్ర ధృవీకరణ ఇంకా అందుబాటులో లేదు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో నిషేధిత వేర్పాటువాద సంస్థగా గుర్తింపు పొందింది. బలూచిస్తాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఇతర లక్ష్యాలపై గతంలో కూడా పలు దాడులకు పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించింది. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us