AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వర్షం కురిసినా.. అడుగులు ఆగలేదు.. చిన్నారుల స్నేహం హృదయాలను కదిలిస్తోంది..!

ముగ్గురు పాఠశాల విద్యార్థులు చిన్నారులు కుండపోత వర్షంలో చేతులు పట్టుకుని కొండ మార్గంలో స్కూల్‌కు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగురంగుల రెయిన్‌కోట్లు ధరించి, జారుడుగా ఉన్న కొండ దారిలో ఒకరికొకరు తోడుగా నడుస్తున్న ఈ చిన్నారుల దృశ్యం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.

Viral Video: వర్షం కురిసినా.. అడుగులు ఆగలేదు.. చిన్నారుల స్నేహం హృదయాలను కదిలిస్తోంది..!
Children Walking In Rain
Balaraju Goud
|

Updated on: Jul 25, 2026 | 12:35 PM

Share

ముగ్గురు పాఠశాల విద్యార్థులు చిన్నారులు కుండపోత వర్షంలో చేతులు పట్టుకుని కొండ మార్గంలో స్కూల్‌కు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగురంగుల రెయిన్‌కోట్లు ధరించి, జారుడుగా ఉన్న కొండ దారిలో ఒకరికొకరు తోడుగా నడుస్తున్న ఈ చిన్నారుల దృశ్యం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. వారి అమాయకత్వం, స్నేహభావం, చదువుపై ఉన్న నిబద్ధతకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో నేపాల్‌కు చెందినదిగా సమాచారం. దీనిని అనిల్ బడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు తన ప్రయాణంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా, భారీ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ముగ్గురు చిన్నారులు స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తుండటం చూసి ఆయన వీడియో తీశారు. వీడియోలో గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగుల రెయిన్‌కోట్లు ధరించిన ముగ్గురు పిల్లలు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నెమ్మదిగా కొండపైకి ఎక్కుతూ కనిపించారు. కుండపోత వర్షం కారణంగా వారి స్కూల్ యూనిఫామ్‌లు పూర్తిగా రెయిన్‌కోట్లతో కప్పబడి ఉన్నాయి.

వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి పిల్లలను పలకరించినప్పటికీ వారు స్పందించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. జారుడు దారిలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిన వారి తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా జేబులో ఒక చేయి పెట్టుకుని ధైర్యంగా నడుస్తున్న అతి చిన్నారి అమాయక నడక సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు చిన్నారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇలాంటి స్నేహమే నిజమైన బలం”, “చదువుపై పిల్లల అంకితభావానికి ఇది అద్భుత ఉదాహరణ”, “ఎంత ముద్దైన దృశ్యం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కొండ ప్రాంతాల్లో విద్యార్థులు ప్రతిరోజూ ఎదుర్కొనే కష్టాలను గుర్తు చేస్తూ, వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అమాయకత్వం, ఐక్యత, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను ప్రతిబింబించిన ఈ వీడియో ప్రస్తుతం లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటూ సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Anil Bud.. (@anil_bud.810)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us