Australian Court: ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఆ వ్యక్తి అక్షరాలా 66 వేల డాలర్లు కట్టాలట.. కంగారు కోర్టు ఖతర్నాక్ ఆర్డర్
ఓ వైపు కరోనా వైరస్ ప్రపం దేశాలను ఖంగారు పెట్టిస్తుంటే.. ఓ ఆస్ట్రేలియన్ కోర్టు సంచలన తీర్పుతో వార్తలకెక్కింది. అదేదో కరోనాకు సంబంధం లేని కేసు అనుకుంటే పొరపాటు పడినట్లే.. కరోనా పాండమిక్ డేస్ కొనసాగుతున్న తరుణంలో ఓ వ్యక్తి...
- Australian Court sensational judgement: ఓ వైపు కరోనా వైరస్ ప్రపం దేశాలను ఖంగారు పెట్టిస్తుంటే.. ఓ ఆస్ట్రేలియన్ కోర్టు సంచలన తీర్పుతో వార్తలకెక్కింది. అదేదో కరోనాకు సంబంధం లేని కేసు అనుకుంటే పొరపాటు పడినట్లే.. కరోనా పాండమిక్ డేస్ కొనసాగుతున్న తరుణంలో ఓ వ్యక్తి కొద్దిపాటి సడలింపు కోరినందుకు ఆస్ట్రేలియన్ కోర్టు సీరియస్ అయ్యింది. ఖతర్నాక్ తీర్పు చెప్పింది. మితి మీరితే ఏకంగా 66 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ఫైన్ వేస్తానంటూ హెచ్చరించింది. అంటే మన కరెన్సీలో ఏకంగా సుమారు 37 లక్షల రూపాయలన్నమాట. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? రీడ్ దిస్..
సరిగ్గా సంవత్సరన్నర క్రితం ఓ ఆస్ట్రేలియన్ ఇండియాకు వచ్చాడు. అదే సమయంలో దేశంలో కరోనా విస్తరణ మొదలైంది. మొదట కంగారు పడ్డా.. ఆ తర్వాత మన దేశంలో కరోనా కంట్రోల్ అయ్యే సరికి ఊపిరి పీల్చుకున్నాడు.. కర్నాటకలో ఓ ప్రాంతంలో వుండిపోయాడు. ఇప్పుడు కర్నాటకలోని బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం మనదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా ఆస్ట్రేలియా కూడా ఇటీవల ఇండియా నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. భారత్ నుంచి వచ్చేవారిపై పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధంపై ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో వివాదం కొనసాగింది. సిడ్నీలోని కోర్టులో ఇండియా నుంచి మన పౌరులను అనుమతించాలని చేస్తూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
దీంతో భారత్‌లో గత ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన 79 ఏళ్ల వ్యక్తి ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. దేశ ఆరోగ్యం దృష్ట్యా.. వైద్యాధికారుల సిఫారసు మేరకు భారతీయుల రాకపై నిషేధం విధించినట్లు మరోసారి సిడ్నీ కోర్టు స్పష్టం చేసింది. కర్నాటకలోని బెంగళూరులో తమ దేశానికి చెందిన వ్యక్తి చిక్కుకునిపోయాడని.. ఇప్పుడతన్ని ఆస్ట్రేలియా వచ్చేందుకు అనుమతించాలని, కానీ పరిస్థితులు పూర్తిగా అడ్డంకిగా మారాయని సిడ్నీ కోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేశాడు. దీనిని కోర్టు మే 10న విచారించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలోకి ఎవరినీ రానిచ్చేది లేదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. ఒకవేళ వచ్చేందుకు ప్రయత్నిస్తే 66 వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. అంటే సిడ్నీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే సదరు ఆస్ట్రేలియన్ గనక ఆ దేశానికి వెళితే.. ఏకంగా 37 లక్షల రూపాయల జరిమానా చెల్లించడంతోపాటు.. అయిదేళ్ళు జైల్లో మగ్గాల్సి వుంటుందన్నమాట.
ALSO READ: శరవేగంగా వ్యాక్సిన్ పంపిణీకు మోదీ కొత్త ఎత్తు… అమెరికా ఓకే.. కానీ ఈయూ దేశాల మోకాలడ్డు!
ALSO READ: కరోనా మృతుల విషయంలో ఆందోళన వద్దు.. జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహించినా ప్రమాదమేమీ లేదు