Arrest warrant: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..

మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అరెస్టు చేసి నవంబర్‌ 18లోగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాపై అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది.

Arrest warrant: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
Arrest Warrant Against Sheikh Hasina
Follow us

|

Updated on: Oct 17, 2024 | 3:18 PM

బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త విద్యార్థుల నిరసన తర్వాత ఆగస్టులో అధికారం నుండి తొలగించబడిన మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మహ్మద్‌ తాజుల్‌ ఇస్లాం మాట్లాడుతూ.. మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అరెస్టు చేసి నవంబర్‌ 18లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.  మాజీ ప్రధాని భారతదేశానికి పారిపోయారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుండి పారిపోయినప్పటి నుండి బహిరంగంగా కనిపించలేదన్నారు. ఆమె ప్రస్తుతం భారత రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని సైనిక వైమానిక స్థావరంలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాపై అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. హసీనా 15 ఏళ్ల పాలనలో, ఆమె రాజకీయ ప్రత్యర్థులపై సామూహిక నిర్బంధం, చట్టవిరుద్ధమైన హత్యలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనలు విస్తృతంగా చేసినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్‌తో పాటు పేర్లు వెల్లడించని మరో 44 మందిపై కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనా పదవి నుంచి వైదొలిగిన న తర్వాత డజన్ల కొద్దీ హసీనా మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ క్యాబినెట్ మంత్రులు, ఆమె అవామీ లీగ్ పార్టీకి చెందిన ఇతర సీనియర్ సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఆమె పాలనలో నియమించిన అధికారులను కూడా తొలగించారు.

మరిన్నీ అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే హ్యాక్ అయినట్టే!
మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపించాయా.. అయితే హ్యాక్ అయినట్టే!
అంత ఓవరాక్షన్ ఎందుకు భయ్యా.! ఇప్పుడు చూడు ఏమైందో..
అంత ఓవరాక్షన్ ఎందుకు భయ్యా.! ఇప్పుడు చూడు ఏమైందో..
రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 10వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌
రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 10వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌
అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..
అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..