లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్‌ ఎంతంటే ??

లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్‌ ఎంతంటే ??

|

Updated on: Oct 17, 2024 | 1:26 PM

ఇదేంటి.. నరేంద్రమోదీ ఏంటి లక్కీ లాటరీ విన్‌ అవ్వడమేంటి అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. దసరా సందర్భంగా వాడవాడలా అమ్మవారికి రంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా లక్కీ లాటరీలను ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి లక్కీ లాటరీల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా లక్కీ లాటరీలో బహుమతులుగా కార్లో, బైకులో, సైకిళ్లో పెడతారు.

కానీ ఈసారి కోళ్లు, గొర్రెపోతులు, మేకలు అన్నీ లక్కీ లాటరీలో బహుమతులుగా నిలిచాయి. ఈ లక్కీ లాటరీని ఖమ్మలో నిర్వహించారు. తాజాగా మరో విచిత్ర సంఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లక్కీ డ్రాలో పాల్గొన్న స్థానిక భక్తుడు ప్రధాని నరేంద్రమోదీ పేరు మీద లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. దసరా ఉత్సవాలు ముగియడంతో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అనూహ్యంగా నరేంద్రమోదీ పేరు మీద ఉన్న టిక్కెట్ కు రెండో బహుమతి వచ్చింది. నరేంద్రమోదీ పేరు రాగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నరేందర్ మోదీ పేరు మీద బహుమతి గెలుచున్న భక్తుడికి శ్రీ శక్తి యూత్ సభ్యులు మిక్సీని గిఫ్ట్ గా అందించారు. ఇప్పుడు.. ఆ బహుమతి గెలుచుకున్న వ్యక్తి అందరూ నరేందర్ మోదీ అని పిలుస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..

దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??

TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్‌ !! | ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??

చెన్నైలో వర్ష బీభత్సం.. మళ్లీ మునిగిపోనుందా ??

Follow us