తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..

తప్పుడు వార్తలపై... సీరియస్ అయిన కిచ్చా..

|

Updated on: Oct 17, 2024 | 1:12 PM

కన్నడ బిగ్ బాస్ ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రారంభం నుంచి బిగ్‌బాస్‌కి కిచ్చా సుదీప్ నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు.. పోతున్నారు కానీ హోస్ట్ గా సుదీప్ ప్లేస్ మాత్రం మారలేదు. కన్నడలో బిగ్ బాస్ అంటే సుదీప్. సుదీప్‌ అంటే బిగ్‌బాస్‌.. అని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి బిగ్ బాస్ హోస్ట్ చేయనని సుదీప్ అధికారికంగా ప్రకటించాడు. తన

నిర్ణయంతో.. ఒక్క సారిగా కన్నడ నాట హాట్ టాపిక్ అయ్యాడు. దాంతో పాటే ఈ స్టార్ హీరో.. బిగ్ బాస్ నుంచి తప్పుకోడానికి ఆ షో టెలీకాస్ట్ అవుతున్న ఛానెలే కారణం అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన కిచ్చా… కాస్త సీరియస్ అయ్యాడు. మరో ట్వీట్ చేశాడు. తనకు బీబీ షో టెలీకాస్ట్ అవుతున్న ఛానెల్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తన ట్వీట్లో రాసుకొచ్చిన కిచ్చా… ఆ ఛానెల్ తనను అగౌరవపరిచిందంటూ నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ను కొట్టిపాడేశాడు. సదరు ఛానెల్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నానో తన ట్వీట్ లో స్పష్టంగా, సూటిగా ఉందని.. మరో సారి గుర్తు చేశాడు. అంతేకాదు తాను పనిచేస్తున్న టీమ్‌పై లేనిపోని ఆరోపణలు ఎదురవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోనని కూడా.. తన ట్వీట్లో వార్నింగ్ ఇచ్చాడు కిచ్చా సుదీప్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??

TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్‌ !! | ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??

చెన్నైలో వర్ష బీభత్సం.. మళ్లీ మునిగిపోనుందా ??

Follow us