దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య జరిగి సుమారు నాలుగు నెలలు గడిచింది. నటుడు దర్శన్, అతని గ్యాంగ్ రేణుకా స్వామిని అత్యంత పాశవికంగా హతమార్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. రేణుకా స్వామి చనిపోయేనాటికి తన భార్య సహానా ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఎస్! చిత్రదుర్గ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రేణుకా స్వామి భార్య సహానా డెలివరీ అయింది. దీంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అదే సమయంలో బిడ్డ పక్కన తండ్రి పక్కన లేకపోవడంతో సహానా కన్నీరుమున్నీరవుతోంది. ఇక దర్శన్ సన్నిహితురాలు పవిత్రకు రేణుకా స్వామి అసభ్యకర సందేశాలు పంపాడని అందుకే ఈ నటుడు అతనిని చంపాడని ఆరోపణలు ఉన్నాయి. రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి పట్టగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా హత్య చేశారని దర్శన్ గ్యాంగ్ పోలీసు విచారణలో నేరం కూడా ఒప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్ !! | ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??
వైరల్ వీడియోలు
Latest Videos