TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్ !! | ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
దేవర పార్డ్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనతో జూనియర్ ఎన్టీఆర్ ఓ లెటర్ రాసారు. అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తన సహ నటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే దర్శకుడు కొరటాల శివకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజా సాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోంది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. రాజా సాబ్ స్నీక్‌పీక్ వరల్డ్ గ్లింప్స్ చూడటానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ ను కలిసేందుకు 1600 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి వచ్చాడు ఓ అభిమాని. తన కోసం ఇంత సాహసం చేసిన అభిమానిని స్వయంగా కలిసి కాసేపు తనతో టైమ్ స్పెండ్ చేశారు బన్నీ. పుష్ప సక్సెస్ తరువాత నార్త్ ఇండియాలోనూ బన్నీ అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??
Published on: Oct 17, 2024 12:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos