AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో వర్ష బీభత్సం.. మళ్లీ ముంపు గండం.. ??

చెన్నైలో వర్ష బీభత్సం.. మళ్లీ ముంపు గండం.. ??

Phani CH
|

Updated on: Oct 17, 2024 | 1:45 PM

Share

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. ఇది నెల్లూరు-పుదుచ్చేరి మధ్య ఈ రోజు తెల్లవారుజామున తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. చెన్నైలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుండపోత వర్షం కురుస్తోంది. నగరం జలసంద్రంగా మారింది. వీధులన్నీ నదుల్లా, వాడలన్నీ చెరువుల్లా తయారయ్యాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాలు మూతపడ్డాయి. భారీ వర్షాలకు సబ్‌వేలలో వర్షపు నీరు చేరింది. పల్లపు ప్రాంతాలన్నీ దీవుల్లా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రజనీకాంత్‌కు చెందిన పోయెస్‌ గార్డెన్‌ నివాసం కూడా వరద నీటిలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతంలో ఇల్లు ఉండడంతో ప్రాంగణమంతా వరద నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే.. 50 శాతం ప్రసవాల్లో ట్విన్సే పుడతారు ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్‌ గ్యాంగ్ కాంట్రాక్ట్ పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ?? Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!  

Published on: Oct 17, 2024 12:33 PM