శుభవార్త.. లైట్ మోటార్ వాహనాలకు.. టోల్ ఫీజులు రద్దు

శుభవార్త.. లైట్ మోటార్ వాహనాలకు.. టోల్ ఫీజులు రద్దు

|

Updated on: Oct 17, 2024 | 1:30 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో షిండే సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉన్న టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయబోమని ప్రకటించింది. కార్లు, ఎస్‌యూవీలకు.. సోమవారం అర్ధరాత్రి నుంచే టోల్ ఫీజులు వసూలు చేయబోమని తెలిపింది. ఇది వాహనదారులకు గుడ్‌న్యూస్‌గా చెప్పుకోవాలి.

సీఎం ఏక్‌నాథ్‌ షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏక్‌నాథ్ షిండే.. గతంలో అనేక సార్లు టోల్‌ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు సీఎం పదవిలో ఉన్న షిండే టోల్ ఛార్జీలు వసూలు చేయడాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌కు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో.. టోల్ ఛార్జీల రద్దుతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. షిండే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై నగరంలోకి వాహనాలకు వచ్చే 5 టోల్‌ప్లాజాల దగ్గర టోల్‌ ఛార్జీల భారం తగ్గనుంది. దహిసర్‌, ములుంద్‌, వాషి, ఐరోలి, తిన్హంత్‌ నాకా ప్రాంతాల్లో ఉన్న టోల్ ప్లాజాల నుంచి కార్లు, ఎస్‌యూవీలు ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించకుండా దూసుకెళ్లిపోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం టోల్‌ ఫీజు రూ.45 వసూలు చేస్తున్నారు. ముంబై నగరంలోకి నిత్యం ప్రవేశించే చిన్న వాహనాలతో రోజువారీ ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్రానికి ఊహించని షాక్ ఇచ్చిన పొట్టేలు.. ఏం చేసిందో చూడండి !!

లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్‌ ఎంతంటే ??

తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..

దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??

TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్‌ !! | ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Follow us