గుర్రానికి ఊహించని షాక్ ఇచ్చిన పొట్టేలు.. ఏం చేసిందో చూడండి !!
సాధారణంగా చిన్న జంతువులు పెద్ద జంతువులను చూస్తే భయపడతాయి. వాటిని చూడగానే దూరంగా పారిపోతాయి. ఒక్కోసారి సీన్ రివర్స్‌లో ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు అంటే పులులు, సింహాలే ఒక్కోసారి చిన్ని చిన్ని జంతువులకు భయపడి తోకముడుస్తుంటాయి. అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. ఓ పొట్టేలు.. గుర్రానికి ఊహించని షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. ఓ షెడ్‌లో కొన్ని పొట్టేళ్లు మేత మేస్తుంటాయి. ఇంతలో అక్కడికి ఓ గుర్రం వస్తుంది. తమ ఆహారాన్ని ఎక్కడ ఈ గుర్రం తినేస్తుందని అనుకున్నాయో ఏమో కానీ.. ఓ పొట్టేలు ఆవేశంగా గుర్రానికి ఎదురుగా వెళ్లింది. వెళ్లీ వెళ్లగానే దాని కాళ్ల కింద దూరి ధబేల్‌మని కింద పడేసింది. పాపం ఊహించని ఈ పరిణామానికి గుర్రం షాకయింది. పైకి లేచి తన దారిన తాను పోతుంది. అయినా ఈ పొట్టేలు.. గుర్రాన్ని వదల్లేదు. వెళ్లిపోతున్న గుర్రం వెనుక భాగాన్ని తన తలతో ఢికొడుతుంది. అయినా గుర్రం తల వంచుకుని తన దారిన పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘‘ఈ పొట్టేలు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హైట్, వెయిట్ చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 1.6 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 100 మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్ ఎంతంటే ??
తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..
దర్శన్ గ్యాంగ్ చంపేసిన రేణుకా స్వామి మళ్లీ పుట్టాడా ??
TOP 9 ET News: ఫ్యాన్స్‌కు NTR మెసేజ్ !! | ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

