- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new smartphone Redmi A4 5G features and price details
Redmi A4 5G: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్.. రూ. 10వేలలో స్టన్నింగ్ ఫీచర్స్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ ఏ4 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. తాజాగా కంపెనీ ఈ ఫోన్‌ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రదర్శించింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 17, 2024 | 2:48 PM

రెడ్‌మీ ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ4 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాన్ 4ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇక ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ డ్యూయల్ 12 బిట్ ఐఎస్‌పీ కెమరాకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను బ్లాక్, వైట్ కలర్‌లో తీసుకొచ్చారు. తొలి సేల్ ఎప్పటి నుంచి అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

రెడ్‌మీ ఏ4 స్మార్ట్ ఫోన్‌లో 6.25 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమఏహెచ్ బ్యాటరీని అందించారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ధర విషయానికొస్తే రూ. 10 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.




