Covid-19: చైనా బండారం బట్టబయలు.. కరోనావైరస్ పుట్టుకకు కారణం ఎవరో తేలిపోయింది.. సంచలన విషయాలు..
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది మరణించారు. ఈ మహమ్మారి అన్నీ రంగాలను దిగజార్చింది. మూడేళ్ల నుంచి కంటింకి కనిపించని వైరస్‌తో ప్రజలంతా పోరాడుతున్నారు.
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది మరణించారు. ఈ మహమ్మారి అన్నీ రంగాలను దిగజార్చింది. దాదాపు మూడేళ్ల నుంచి కంటింకి కనిపించని వైరస్‌తో ప్రజలంతా పోరాడుతున్నారు. ఇప్పటికీ.. పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు పలు దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19 గురించి చైనాలో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త సంచలన విషయాలను బయటపెట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వుహాన్ ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ కరోనా మానవ నిర్మిత వైరస్ అంటూ పేర్కొన్నారు. ఇది ల్యాబ్ నుంచి లీకయ్యిందని వెల్లడించారు. ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేసిన అమెరికా పరిశోధకుడు ఆండ్రూ హఫ్.. అందులో కోవిడ్ ల్యాబ్ లీక్ థియరీ గురించి వెల్లడించినట్టు న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ నిర్వహణ, నిధులతో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) నుంచి కోవిడ్ లీక్ అయిందని తెలిపారు. బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్‌లో పరిశోధకుడు ఆండ్రూ హఫ్ ప్రకటనను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ దీనిని నివేదించింది. “ది ట్రూత్ అబౌట్ వుహాన్” పుస్తకంలో ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ పలు విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. యుఎస్ ప్రభుత్వం వైరస్‌కు నిధులు సమకూర్చడం వల్లే చైనాలో కరోనావైరస్ మహమ్మారి సంభవించిందని పేర్కొన్నారు.
అయితే.. చైనాలో ఈ వైరస్ ప్రయోగాలు నిర్వహణ, భద్రతా లోపంతో నిర్వహించారని తెలిపారు. ఫలితంగా వుహాన్ ల్యాబ్‌లో లీక్ అయ్యిందని ఆండ్రూ హఫ్ పేర్కొన్నారు.”సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నిర్ధారించడానికి విదేశీ ప్రయోగశాలలలో తగిన నియంత్రణ చర్యలు లేవు.. దీంతో చివరికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వైరస్ లీక్‌కు దారితీసింది” అని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో వివరించారు. ఇది జన్యుపరంగా అభివృద్ది జరిగిందని.. దీనిగురించి చైనాకు ముందు నుంచి తెలుసని తెలిపారు. అపాయకరమైన ఈ బయోటెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి US ప్రభుత్వమే కారణమని.. ఇది చూసి తాను కూడా భయపడ్డానని.. ఈ సమయంలో వారికి బయోవెపన్ టెక్నాలజీని అందజేస్తున్నామని.. ఆండ్రూ హాఫ్ పుస్తకంలో వివరించినట్లు వార్త సంస్థలు తెలిపాయి.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆండ్రూ హఫ్ ఎకోహెల్త్ అలయన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్. న్యూయార్క్‌లోని ఒక లాభాపేక్షలేని సంస్థ అయిన ఇది.. అంటు వ్యాధుల గురించి అధ్యయనం చేస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..