AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: మార్గమధ్యలో ఉన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమై పైలట్‌ ఏం చేశాడంటే?

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. విమానానికి థ్రెట్‌ కాల్‌ రావడంతో అప్రమత్తమైన అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని సౌదీ అరేబియాలోని రియాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీంలో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Air India: మార్గమధ్యలో ఉన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమై పైలట్‌ ఏం చేశాడంటే?
Air India Flight Cancelled
Anand T
|

Updated on: Jun 22, 2025 | 5:45 PM

Share

ఈ మధ్యకాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు, విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్‌ ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా ప్రమాదంలో 270 మందికిపై ప్రయాణికులు చనిపోవడం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ప్రమాదం మరువక ముందే తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌ వచ్చింది దీంతో విమానాన్ని అత్యవస ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

కాగా జూన్ 21వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన AI114 విమానం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే మార్గమ్యదలో ఈ విమానికి ఓ బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని వెంటనే సౌదీ అరేబియా రాజధానిలోని రియాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టుకు మళ్లించినట్టు అధికారులు పేర్కొన్నారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ప్రొటోకాల్ ప్రకారం విమానంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసి తిరిగి గమ్య స్థానానికి పంపినట్టు ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా అదే రోజు ఇండిగోకు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణాన్ని రద్దు చేసినట్లు కొన్ని జాతీయ మీడియాల్లో నివేదికలు వచ్చారు. అంతేకాకుండా, శనివారం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా వాతావరణం అనుకూలించక వారణాసిలో అత్యవసర ల్యాండింగ్‌ అయినట్టు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..