Afghanistan Crisis: అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో తాలిబన్లకు రాజీ ప్రతిపాదన చేసిన పంజ్‌షీర్‌ రెసిస్టెన్స్ ఫోర్స్

రెసిస్టెన్స్ ఫోర్స్ (అహ్మద్ మసూద్ వర్గం).. తాలిబాన్ మధ్య యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌లో కొనసాగుతోంది. అయితే, రెసిస్టెన్స్ ఫోర్స్ బలహీనపడినట్టు వార్తలు వస్తున్నాయి.

Afghanistan Crisis: అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో తాలిబన్లకు రాజీ ప్రతిపాదన చేసిన పంజ్‌షీర్‌ రెసిస్టెన్స్ ఫోర్స్
Afghanistan Crisis Panjshir

Afghanistan Crisis: రెసిస్టెన్స్ ఫోర్స్ (అహ్మద్ మసూద్ వర్గం).. తాలిబాన్ మధ్య యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్‌షీర్‌లో కొనసాగుతోంది. అయితే, రెసిస్టెన్స్ ఫోర్స్ బలహీనపడినట్టు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం అహ్మద్ మసూద్ తాలిబన్లతో యుద్ధాన్ని ముగించాలని ప్రతిపాదించాడు. ఇంతకు ముందు, పంజ్‌షీర్..ఆండ్రాబ్‌లో తాలిబాన్ దాడులను ఆపడానికి అతను ఒక షరతు పెట్టాడు.

ఈ సమయంలో తాలిబాన్లు బలమైన స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. తాలిబాన్ యోధులు పంజ్‌షీర్‌ను బలవంతంగా పట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఈ పోరాటాన్ని మసూద్ ప్రారంభించాడు. కాబట్టి తాలిబాన్ యోధులలో కోపం ఉంది. తాలిబాన్ లోని ఒక విభాగం రెసిస్టెన్స్ ఫోర్స్ తిరుగుబాటుదారులను శిక్షించాలని కోరుతోంది. మరోవైపు తమ పోరాటయోధులు పంజ్‌షీర్ గవర్నర్ కార్యాలయంలోకి ప్రవేశించారని తాలిబాన్లు పేర్కొన్నారు.

అనేక మంది అగ్ర కమాండర్ల మరణం..

చాలా మంది అగ్రశ్రేణి పంజ్‌షీర్ కమాండర్లు ఆదివారం జరిగిన పోరులో మరణించారు. వాటిలో ప్రముఖమైనవాడు ఫహీం దష్టి. మాజీ జర్నలిస్ట్ కూడా అయిన ఫహీం పంజ్‌షీర్ ప్రతినిధి. వారితో పాటు, మసూద్ కుటుంబానికి చెందిన కమాండర్లు కూడా తాలిబన్ చేతిలో హతం అయినట్టు తెలుస్తోంది. వీరిలో గుల్ హైదర్ ఖాన్, మునీబ్ అమిరి, జనరల్ వుడాడ్ ఉన్నారు.

పలువురు అగ్రశ్రేణి పంజ్‌షీర్ కమాండర్ల మరణాన్ని తాలిబాన్ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పుడు మసూద్ వర్గం కూడా దీనిని ధృవీకరించింది. ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఉంటున్న ఇంటిపై హెలికాప్టర్ దాడి చేసిందని బిబిసి జర్నలిస్ట్ బిలాల్ సర్వారీ పేర్కొన్నారు. సలేహ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

కాల్పుల విరమణ సాకుతో మసూద్ తన యోధులను ఏకం చేయడానికి ప్రయత్నించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వారికి కొంత సమయం ఇస్తుంది. శీతాకాలానికి ముందు తాలిబాన్లు పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోకపోతే, వారికి అక్కడ ప్రవేశించడం అదేవిధంగా పోరాటం చేయడం కష్టంగా మారుతుంది. ఈ నేపధ్యంలో రాజీ ప్రతిపాదనను తిరస్కరించాలని తాలిబాన్ లోని ఒక వర్గం బలంగా పట్టుపడుతోంది.

మరోవైపు పంజ్‌షేర్‌ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు ఆఫ్ఘన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహే. తాలిబన్లు రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు దాడుల తరువాత రెండు లక్షల మంది పంజ్‌షేర్‌లో తలదాచుకుంటున్నారని , వాళ్లను ఆదుకోవాలని కోరారు. తాలిబన్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

ఇదిలా ఉండగా, మరోవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించబోమని ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజాస్వామ్యయుతంగా ఎన్పికలు జరగాలని కోరుకుంటునట్టు తెలిపింది. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇవాళ, రేపు అంటూ వాయిదాల పర్వం నడుస్తోంది. ఐతే మరో మూడు వారాల తర్వాతే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాలిబన్ల మధ్య అంతర్గత విభేదాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రెండ్రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటనలు అంటూ వార్తలొచ్చాయి..కానీ అలాంటిదేమీ లేదు. ఐతే తాము అంతర్జాతీయ మద్దతు కోసం ఎదురుచూస్తున్నామని..అందుకోసమే జాప్యం జరుగుతున్నట్లు వెల్లడించారు తాలిబన్లు. వచ్చేవారం ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ వివరాలు వెల్లడిస్తామంటున్నారు.

Also Read: Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ.. 6 వందల మంది హతం..! 

Click on your DTH Provider to Add TV9 Telugu