AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kabul Twin Blasts: కాబూల్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు.. 19 మంది మృతి..

ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో దారుణం జరిగింది. మంగళవారం కాబూల్‌లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 19 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు....

Kabul Twin Blasts: కాబూల్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు.. 19 మంది మృతి..
Afghan
Srinivas Chekkilla
|

Updated on: Nov 02, 2021 | 5:28 PM

Share

ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో దారుణం జరిగింది. మంగళవారం కాబూల్‌లో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 19 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘానిస్తాన్‎లో తాలిబాన్లు అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత వరుసగా పేలుళ్లు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పేలుళ్లు ఎవరు చేశారు అనేది తెలియలేదు. ఒక పేలుడు మిలిటరీ ఆసుపత్రి గేట్ వద్ద జరిగింది. మరో పేలుడు ఆసుపత్రికి సమీపంలో జరిగింది. “నేను ఆస్పత్రి లోపల ఉన్నాను. మొదటి చెక్‌పాయింట్ నుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. మమ్మల్ని సురక్షిత గదులకు వెళ్లమని చెప్పారు. నేను తుపాకీ కాల్పులు కూడా విన్నాను” అని కాబూల్‌లోని సర్దార్ మహ్మద్ దౌద్ ఖాన్ ఆసుపత్రి వైద్యుడు చెప్పాడు. ఆసుపత్రి భవనంలో తుపాకీ కాల్పుల శబ్దం నాకు ఇప్పటికీ వినిపిస్తోందని అన్నారు.

గతంలో 2017లో ఆసుపత్రిపై దాడి జరిగింది, వైద్య సిబ్బందిగా మారువేషంలో వచ్చిన ముష్కరులు 30 మందిని కాల్చి చంపారు. తాలిబాన్ ప్రత్యేక బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్తీ తెలిపారు. “పేలుడు వల్ల ప్రాణనష్టం జరిగింది, వివరాలు తరువాత వెల్లడిస్తామని” అని చెప్పాడు. ఈ పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. ఫొటోల్లో పేలుళ్ల తర్వాత గాలిలోకి నల్లటి పొగలు కమ్ముకున్నట్లు కనిపించాయి.

అక్టోబర్ 15న కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో మూడు బాంబు పేలుడులు సంభవించాయి. షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐఎస్-కే ప్రకటించుకుంది. తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఐఎస్-కే అఫ్గానిస్తాన్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. రాజకీయ నాయకులు, భద్రతా దళాలు, మంత్రిత్వ కార్యాలయాలను, తాలిబాన్లను, అమెరికా, నాటో సేనలను, అంతర్జాతీయ సహాయ సంస్థలను, షియా మైనారిటీలు, సిక్ మైనారిటీలను కూడా వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.

Read Also.. Warning to Pakistan: పాకిస్తాన్‌కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వార్నింగ్.. నాశనం చేసేస్తామంటూ ప్రకటన!