Knowledge: ఆ దేశాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాలేదు.. WHO డేటాలో ఆసక్తికర విషయాలు
యావత్ ప్రపంచాన్ని కోవిడ్ -19 మహమ్మారి హడలెత్తించింది. కోవిడ్ నుంచి పుట్టుకొచ్చిన పలు రకాల వేరియంట్‌లతో ప్రాణనష్టం భారీ సంఖ్యలోనే జరిగింది.
World Covid-19 Cases: యావత్ ప్రపంచాన్ని కోవిడ్ -19 మహమ్మారి హడలెత్తించింది. కోవిడ్ నుంచి పుట్టుకొచ్చిన పలు రకాల వేరియంట్‌లతో ప్రాణనష్టం భారీ సంఖ్యలోనే జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారిక సమాచారం మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు 41.66 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. గత వారం రోజుల వ్యవధిలోనే 1.40 కోట్ల మందికి కరోనా వైరస్ సోకింది. కాగా ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 58,44,097గా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే 67,631 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదుకాగా.. ఆ తర్వాతటి స్థానాల్లో భారత్, బ్రెజిట్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఉన్నాయి.
అమెరికాలో 7,74,13,180 మంది కరోనా బారినపడగా.. మొత్తం 9,18,560 మంది మరణించారు. భారత్‌లో ఇప్పటి వరకు 4.27 కోట్ల కరోనా కేసులు నమోదుకాగా.. 5.10 లక్షల మంది మరణించారు. అలాగే బ్రెజిల్‌లో 2.76 కోట్ల మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 6.39 లక్షలుగా ఉంది. ఫ్రాన్స్‌లో 2.13 కోట్ల కరోనా కేసులు, 1.32 లక్షల మరణాలు, బ్రిటన్‌లో 1.84 కోట్ల కరోనా కేసులు, 1.60 లక్షల మరణాలు నమోదయ్యాయి.
ఆ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదుకాలేదు..
కాగా డబ్ల్యూహెచ్‌వో అధికారిక గణాంకాల మేరకు తొమ్మిది దేశాలు, దీవుల్లో ఇప్పటివరకు జీరో COVID-19 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో తువాలు, తుర్క్‌మెనిస్తాన్, టోకెలావ్, సెయింట్ హెలెనా, పిట్‌కైర్న్ దీవులు, నియు, నౌరు, మైక్రోనేషియాతో పాటు ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాలు కరోనా కేసులు నమోదైనట్లు తమకు నివేదించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా వంటి దేశాలు తమ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కోవిడ్‌కు సంబంధించిన వార్తలను ఇక్కడ చదవండి..
Also Read..
Chanakya Niti: పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకుని మెలగాలంటున్న చాణక్య..
Andhra Pradesh: సచివాలయానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు