Andhra Pradesh: స‌చివాల‌యానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారుల‌కు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది.

Andhra Pradesh: స‌చివాల‌యానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారుల‌కు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ఆదేశాలు
Ap Cs
Follow us

|

Updated on: Feb 18, 2022 | 3:36 PM

AP Secretariat Higher Officers: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి(Coronavirus) త‌గ్గుముఖం ప‌ట్టడంతో ఉన్నతాధికారుల‌కు ప్రధాన కార్యదర్శి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం పరిథిలో కోవిడ్ 19 సంబంధిత పరిమితులను ఎత్తివేసిన‌ట్లు ప్రక‌టించింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ శాఖ‌ల‌ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శుల‌, ముఖ్య కార్యద‌ర్శులు, కార్యదర్శులంతా సచివాలయం నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఆదేశాలు జారీ చేశారు

కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేసినందున తప్పనిసరిగా సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల‌కు సీఎస్ సూచించారు. ప్రజలకు ఇంతకాలం జరిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ద్వారా హాజరు నమోదు చేయాల‌ని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు ఉన్నతాధికారు విధిగా హాజరు కావాలన్నారు..

ఇదిలావుంటే, సచివాలయంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయవాడ లోని వివిధ హెచ్ఓడీ కార్యాలయాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను సడలించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా కేసులు పెరిగిపోవటంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా శరవేగంగా చేసింది.

Read Also….  AP Cabinet: ఉగాదికి కొత్త జిల్లాలతో పాటు కొలువుదీరనున్న కొత్తమంతివర్గం.. గంపెడు ఆశలతో నేతలు..!

Latest Articles
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?