Hindu Boy in Pakistan: పాకిస్తాన్ లో పోలీసు కస్టడీలో 8 ఏళ్ళ హిందూ బాలుడు…అసలేమైందంటే..?
పాకిస్తాన్ లో 8 ఏళ్ళ హిందూ బాలుడు తాను తెలియక చేసిన తప్పుతో ఇబందుల్లో పడ్డాడు. అది అతని పాలిట ' నేరం' గా మారింది. ఓ మదర్సా లైబ్రరీలో ఈ కుర్రాడు మూత్ర విసర్జన చేయడంతో అతనిపై కేసు పెట్టారు. పోలీసు ప్రొటెక్టివ్ కస్టడికి పంపారు.

పాకిస్తాన్ లో 8 ఏళ్ళ హిందూ బాలుడు తాను తెలియక చేసిన తప్పుతో ఇబందుల్లో పడ్డాడు. అది అతని పాలిట ‘ నేరం’ గా మారింది. ఓ మదర్సా లైబ్రరీలో ఈ కుర్రాడు మూత్ర విసర్జన చేయడంతో అతనిపై కేసు పెట్టారు. పోలీసు ప్రొటెక్టివ్ కస్టడికి పంపారు. దైవ దూషణకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నవారిపై పోలీసులు పెట్టిన కేసుల్లో.. ఈ బాలుడే అతి పిన్న వయస్కుడైన నిందితుడయ్యాడు. ఈ లైబ్రరీలో మత పరమైన పవిత్ర గ్రంథాలు ఉన్నాయని, కానీ ఈ కుర్రాడు తనకు తెలిసే ఇలా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే తమ పిల్లాడికి ఏమీ తెలియదని, అసలు దైవ దూషణ అంటే ఆ వయస్సులోని వారికెవరికైనా ఏం తెలుస్తుందని ఆ బాలుడి కుటుంబం అంటోంది. పంజాబ్ ప్రావిన్స్ లోని రహీం యార్ ఖాన్ జిల్లాలో ఇటీవల ఓ హిందూ ఆలయంపై ఓ గుంపు దాడి చేసిన విషయం గమనార్హం ఈ బాలుడు కూడా ఈ ఆలయ సమీపంలోని ఓ కుటుంబానికి చెందినవాడని గార్డియన్ పత్రిక పేర్కొంది.
ఈ ఆలయంపై దాడి ఘటనతో సుమారు 50 మందిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఇక్కడ నివసిస్తున్న పలు హిందూ కుటుంబాలు ఇంకా భయంతో బిక్కుబిక్కు మంటున్నాయి. ఈ బాలుడి కుటుంబం కూడా ఎక్కడో అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళింది. తమకు ఇక్కడ రక్షణ లేదని, అమాయకుడైన తమ బాలుడిని ఏం చేస్తారోనని ఈ కుటుంబం వాపోతోంది. పాకిస్తాన్ లో దైవ దూషణకు పాల్పడినవారికి మరణ శిక్ష విధిస్తారు. ఇలా కఠిన చర్యలు ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..