Oldest Mother: మాతృత్వానికి వయసుతో పనిలేదు.. 70ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ..
మాతృత్వం ఓ వరం. ఏ మహిళ అయినా తన చేతుల్లో బిడ్డను ఆడించాలని, పిల్లాడిని ఎత్తుకొని తిరగాలని కోరుకుంటుంది. అందుకే అమ్మగా పుట్టడం గొప్పగా భావిస్తారు. ఒక జీవికి ప్రాణం పోసి గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. అందుకో పాత చిత్రంలో ఒక పాట ఉంటుంది.

మాతృత్వం ఓ వరం. ఏ మహిళ అయినా తన చేతుల్లో బిడ్డను ఆడించాలని, పిల్లాడిని ఎత్తుకొని తిరగాలని కోరుకుంటుంది. అందుకే అమ్మగా పుట్టడం గొప్పగా భావిస్తారు. ఒక జీవికి ప్రాణం పోసి గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. అందుకో పాత చిత్రంలో ఒక పాట ఉంటుంది. సృష్టి కర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ అని. అంటే సమస్త చరాచర జీవ కోటిని సృష్టించే బ్రహ్మనైనా సరే.. ఒక మాతృమూర్తే జన్మనివ్వాలని దీని భావం. అందుకే అమ్మతనానికి అంత విలువ. దీనిని వయసుతో సంబంధం ఉండదని నిరూపించారు ఈ మహిళ.
మన దేశంలో సంతానం కలుగక రోజూ లక్షల మంది డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. నోములు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈమె ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో తెలియదు కానీ 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చారు. దీంతో ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే గతంలో దక్షిణ భారతదేశంలో 73 ఏళ్ల మహిళ విట్రో (IVF) ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఈమె పేరు సఫీనా నముక్వాయ. ఉగాండా రాజధాని కంపాలాలోని ఆసుపత్రిలో ఆమెకు కాన్పు చేసి ఇద్దరు పిల్లలను బయటకు తీశారు డాక్టర్లు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు కలిగిన నవ మాతృమూర్తిగా నిలిచారు. బుధవారం రోజు ఆమెకు సంతానోత్పత్తి ఆపరేషన్ చేసి ఒక పాప, ఒక బాబును బయటకు తీశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె కూడా చాలా యాక్టీవ్‌గా ఉన్నారు. ఈమెకు విట్రో (IVF) అనే పిండ ఫలదీకరణ చికిత్స కూడా ఇదే ఆసుపత్రి వైద్యులు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఆర్థర్ మ్యాట్సికో శుక్రవారం వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




