New Classical Languages: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదు భాషలకు క్లాసికల్ స్టేటస్

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న 5 భాషలకు ప్రాచీన హోదా/ శాస్త్రీయ హోదా(క్లాసికల్ హోదా) ఇస్తున్నట్లు ప్రకటించింది. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాళీ, ప్రాకృతం లాంగ్వేజ్‌లకు క్లాసికల్ స్టేటస్ ప్రకటించింది. ఈ సందర్భంగా క్లాసికల్ స్టేటస్ కలిగిన లాంగ్వేజీల సంఖ్య 11కి చేరింది.

New Classical Languages: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఐదు భాషలకు క్లాసికల్ స్టేటస్
5 New Classical Languages A
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:37 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న 5 భాషలకు ప్రాచీన హోదా/ శాస్త్రీయ హోదా(క్లాసికల్ హోదా) ఇస్తున్నట్లు ప్రకటించింది. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాళీ, ప్రాకృతం లాంగ్వేజీలకు క్లాసికల్ స్టేటస్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా క్లాసికల్ స్టేటస్ కలిగిన లాంగ్వేజీల సంఖ్య 11కి చేరింది.

ఇంతకు ముందు 6 భాషలకు మాత్రమే క్లాసికల్ స్టేటస్ ఉండేవి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం భాషలకు క్లాసికల్ స్టేటస్ ఉండేవి. మొట్టమొదటి సారి తమిళం భాషకు 2004లో క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత ఒడియా భాషకు 2014లో క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు.ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం చరిత్రను సంస్కృతిని గౌరవిస్తుందని చెప్పారు. ప్రాంతీయ భాషలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాళీ, ప్రాకృత భాషలకు క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలని కెబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ప్రధాని మోదీ చేసిన ట్వీట్:

భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 22 భాషల్లో 11 భాషలకు ఇప్పుడు క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పుడు సగం భాషలు హోదా కలిగి ఉన్నాయి.

క్లాసికల్ స్టేటస్ పొందడానిక ఉండాల్సిన ప్రమాణాలు ఇవే:

  • ఆ భాషకు 1500-200 సం.ల కాలం నాటి ప్రాచీన గ్రంథాలు ఉండాలి
  •  ఆ భాషకు చాలా చరిత్ర ఉండాలి
  • ఆ భాషలో ప్రాచీనమైన సాహిత్యం, రచనలు ఉండాలి