US Air Force Planes: అమెరికా నుంచి భారత్‌కు మరో రెండు కార్గో విమానాల్లో బయలుదేరిన ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, కిట్లు
US Air Force Planes: అమెరికా నుంచి భారత్‌కు తొలి సాయం రాగా, ఇప్పుడు రెండో దశలో రెండు కార్గో విమానాల్లో కరోనాకు సంబంధించి ఆక్సిజన్స్, కరోనా కిట్లు, ఎన్ 95 మాస్కుల..
US Air Force Planes: అమెరికా నుంచి భారత్‌కు తొలి సాయం రాగా, ఇప్పుడు రెండో దశలో రెండు కార్గో విమానాల్లో కరోనాకు సంబంధించి ఆక్సిజన్స్, కరోనా కిట్లు, ఎన్ 95 మాస్కుల బయలుదేరినట్లు అమెరికా రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఇతర సాయంలో అవసరమైన తొలి విడత షిప్‌మెంట్ భారత్‌కు చేరగా, రెండో విడతలో ఆక్సిజన్లు, రెగ్యులేటర్లు, అలాగే డయగ్నోస్టిక్ కిట్లు, ఎన్ 95 మాస్కులు, పల్స్ ఆక్సిమీటర్లు వస్తున్నట్లు సెక్రెటరీ ఆఫ్ డిఫెన్సి ప్రకటించింది.
మొదటి రవాణాలో 960,000 కిట్లు, 1 లక్ష N95 మాస్కులు భారతదేశానికి పంపిస్తున్నామని యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఐఐడి) తెలిపింది. విమానంలో 400 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల రాపిడ్ కరోనా వైరస్ టెస్ట్ పరికరాలు, ఇతర ఆసుపత్రి ఈక్విప్ మెంట్ తో కూడిన సూపర్ గెలాక్సీ ట్రాన్స్ పోర్ట్ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ‘.కోవిడ్ 19 రిలీఫ్ షిప్ మెంట్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎరైవ్డ్ ఇన్ ఇండియా ..బిల్డింగ్ ఆన్ ఓవర్ 70 ఇయర్స్ ఆఫ్ కో-ఆపరేషన్’ అని అమెరికా ట్వీట్ చేసింది. 70 ఏళ్ళ మన ఉభయ దేశాల సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. కోవిడ్ పై పోరులో ఇండియాకు బాసటగా ఉంటామని కూడా స్పష్టం చేసింది. వచ్చే వారం అమెరికా నుంచి సాయంతో కూడిన మరిన్ని విమానాలు రానున్నాయి.
‘కరోనా మొదటి దశలో మన ఆస్పత్రులు దెబ్బతిన్నప్పుడు భారతదేశం అమెరికాకు ఎంతగానో సహాయపడింది. అవసరమైన సమయంలో ఇండియాకు సహాయం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ నిర్ణయించింది’ అని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఇండియాకు అండగా నిలుస్తోంది అగ్రరాజ్యం అమెరికా. అక్కడ నుంచి రెండు భారీ సైనిక రవాణా విమానాలు వైద్య పరికరాలు తీసుకుని భారతదేశానికి బయల్దేరాయి. ఈ మేరకు అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ విమానాలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. ‘ఆక్సిజన్ సిలిండర్లు, వేగవంతమైన డయాగ్నొస్టిక్ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, పల్స్ ఆక్సిమీటర్లు కూడిన రెండు వైమానిక కార్గో విమానాలు అమెరికా నుంచి బయల్దేరాయని’ ఆస్టిన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ సహాయ సహకారాలు భారతదేశానికి ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అమెరికా నుంచి 100 మిలియన్ డాలర్లకు పైగా వైద్య పరికరాలు ఇండియాకు బయలుదేరాయి.
Right now, a @usairforce C-5M Super Galaxy and a C-17 Globemaster III are en route to India from @Travis60AMW. They’re carrying oxygen cylinders/regulators, rapid diagnostic kits, N95 masks, and pulse oximeters. Thanks to @USAID for the supplies & to all involved in the effort. pic.twitter.com/awtUFrT30D
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) April 29, 2021
ఇవీ కూడా చదవండి
అమెరికా నుంచి అందిన తొలి ‘కోవిడ్ సాయం’, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన యూఎస్ విమానాలు