Viral News: పదేళ్ళుగా రోజూ సెల్ఫీలు దిగుతున్న యువకుడు.. చివరికి అలా.. నెట్టింట్లో వీడియో వైరల్..
మన జీవిత ప్రయాణంలో ఒక రోజూ ఉన్నట్లు రెండవ రోజూ ఉండదు. కానీ నిన్న జరిగిన సంఘటనలు మాత్రం మన కళ్ళ ముందు నిలుస్తూనే ఉంటాయి.
Viral Video: మన జీవిత ప్రయాణంలో ఒక రోజూ ఉన్నట్లు రెండవ రోజూ ఉండదు. కానీ నిన్న జరిగిన సంఘటనలు మాత్రం మన కళ్ళ ముందు నిలుస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఘటనలు మనకు గుర్తుండిపోతాయి. కానీ వాటిని మనం తలుచుకోగలము ఆ సమయంలో మన రూపం ఎలా ఉంది అనేది మాత్రం ఉహించుకోవడం చాలా కష్టం. ఇక కొన్ని పాత ఫోటోలను, వీడియోలను చూస్తే మనలో జరిగిన మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పదేళ్ళుగా మనం ఎలా ఉన్నమనేది రోజూ రోజూ ఎలా కనిపించాం అనేది మన ముందుకు వస్తే ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగోతుంది కదూ. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే.. నియాల్ గ్రే అనే యువకుడు గత పదేళ్లుగా తను సెల్ఫీలు తీసుకుంటూ వచ్చాడు. ఇక ప్రస్తుతం అతనిది 24 సంవత్సరాలు వయసు. ఇక పదేళ్ళ నుంచి తీసుకున్న సెల్ఫీలను జతచేసి రెండు నిమిషాలకు పైగా సాగే అద్భుతమైన టైమ్ లాప్స్ వీడియోను రూపొందించాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇదిగో పద్నాలుగేళ్ళ వయసులో నేను. గత పది సంవత్సరాలుగా ప్రతిరోజూ నేను సెల్ఫీ తీసుకుంటూనే ఉన్నా.. అంటూ చెప్పాడు. 14 ఏళ్ళ వయసు నుంచి 24 ఏళ్ళ యువకుడిగా మారటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరీ ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
I’ve been taking a picture of myself everyday for the past 10 years, this is me age 14 to 24 pic.twitter.com/zrhkFm4JiJ
— Niall Gray (@NiallGray) January 1, 2021
Also Read: ఇది విన్నారా.. బర్గర్ తినడం కోసం ఏకంగా 725 కిలోమీటర్లు వెళ్లారు.. హెలీకాప్టర్ బుక్ చేసుకుని మరీ..