ఇది విన్నారా.. బర్గర్ తినడం కోసం ఏకంగా 725 కిలోమీటర్లు వెళ్లారు.. హెలీకాప్టర్ బుక్ చేసుకుని మరీ..

ప్రతి రోజూ ఒకే రకమైన తిండి తింటే మనిషనే వారు ఎవరైనా విసుగెత్తిపోతారు. దాంతో ఏదైనా కొత్తగా టేస్ట్ చేయాలనే ఆలోచనలు వస్తాయి.

ఇది విన్నారా.. బర్గర్ తినడం కోసం ఏకంగా 725 కిలోమీటర్లు వెళ్లారు.. హెలీకాప్టర్ బుక్ చేసుకుని మరీ..
Follow us

|

Updated on: Dec 04, 2020 | 1:18 PM

ప్రతి రోజూ ఒకే రకమైన తిండి తింటే మనిషనే వారు ఎవరైనా విసుగెత్తిపోతారు. దాంతో ఏదైనా కొత్తగా టేస్ట్ చేయాలనే ఆలోచనలు వస్తాయి. అయితే ఒకే రకమైన ఫుడ్ తిని బోర్ కొడుతోందని ఇక్కడ ఓ జంట ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. రోజూ ఒకే రకమైన ఫుడ్ తినడం బోర్ కొడుతోందని భావించిన ఓ జంట ఏకంగా ఒక హెలీకాప్టర్‌ను బుక్ చేసుకుని 725 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కి వెళ్లి జస్ట్ బర్గర్లు తిని తిరుగుపయనం అయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజ్జంగా నిజం.

అసలు వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన విక్టర్ మార్టినోవ్ భాగా ధనవంతుడు. అతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఆరోగ్యం సంరక్షణ రీత్యా వీరు రోజూ సేంద్రీయ ఆహారాన్నే తీసుకుంటారు. అయితే రోజూ ఈ సేంద్రీయ ఆహారం తినీ తినీ వారికి బోర్ కొట్టింది. దీంతో వారు మెక్‌డోనాల్డ్స్‌లో బర్గర్ తినాలని భావించారు. అనుకున్నదే తడవు.. హెలీకాప్టర్‌ను బుక్ చేసుకుని దాదాపు 725 కిలోమీటర్లు ప్రయాణించి క్రిమియాలో ఉన్న మెక్‌డోనాల్ట్స్‌ అవుట్‌లెట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బర్గర్లు తిని తిరుగు పయనం అయ్యారు. అయితే వారు అక్కడ తిన్న వాటికి రూ. 4,800 చెల్లిస్తే.. అక్కడికి వెళ్లి రావడానికి బుక్ చేసుకున్న హెలీకాప్టర్‌కు రూ. 2 లక్షలు చెల్లించడం విషేశం. ‘రోజూ సేంద్రీయ ఆహారం తిని తిని నేను, నా గర్ల్‌ప్రెండ్‌ విసిగిపోయాం. అందుకే బర్గర్ తినాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లాం.’ అని ఆ ధనికుడైన విక్టర్ మార్టినోవ్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉండగా, మార్టినోవ్ చర్యకు అంతా అవాక్కవుతున్నారు. బర్గర్ కోసం హెలికాప్టర్ బుక్ చేసుకుని మరీ 725 కిలోమీటర్లు ప్రయాణించడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా ధనవంతులు తలుచుకుంటే కానిదేముంటది చెప్పండి.