Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడియో

ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడియో

Samatha J

| Edited By: TV9 Telugu

Updated on: Jan 24, 2025 | 4:09 PM

ట్రంప్.. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది ట్రంప్‌కు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అయితే భారత దేశానికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మాత్రం.. అరుదైన బహుమతిని అతడికి అందించేందుకు సిద్ధం అయ్యారు. ఏకంగా వజ్రంపైనే ట్రంప్ ముఖాన్ని చెక్కి.. ఆయనకు పంపబోతున్నారు. అయితే ఈ డైమండ్ ఎంత బరువు ఉంటుంది, దాని విలువ ఎంత అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ సంస్థ.. మూడు నెలలు కష్టపడి 4.5 క్యారెట్ల వజ్రంపై ట్రంప్ ముఖాన్ని చెక్కింది.

 దీని విలుల రూ.8,50,000 వరకు ఉంటుందని అంచనా. కృత్రిమంగా ఈ వజ్రాన్ని తయారు చేయడానికి దాదాపు 90 రోజుల సమయం పట్టగా.. వజ్రాన్ని పెంచడం, కత్తిరించడం, పాలిష్ చేయడం వంటి ఎన్నో పనులను చేశామని తయారీదారులు వివరిస్తున్నారు.సూరత్‌కు చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన నగర వ్యాపారులు ఈ వజ్రంపై డొనాల్డ్ ట్రంప్ ముఖాన్ని చెక్కారు. దీన్ని ఆయనకు బహుమతిగా అందజేస్తామని కూడా వివరించారు. సూరత్..ప్రపంచ వ్యాప్తంగా డైమండ్ కటింగ్ ఇంకా పాలిషింగ్ పరిశ్రమకు ప్రసిద్ధి. అయితే ప్రయోగ శాలల్లో పెంచిన వజ్రాలకు కూడా డిమాండ్ ఎక్కువ కావడంతో.. సూరత్‌లో వజ్రాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తునే చర్యలు చేపట్టింది. గతంలో మోదీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్, జిల్ బైడెన్‌లకు బహుమతిగా ఇచ్చిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని కూడా ఈ కంపెనీయే తయారు చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ ముఖాకృతిలో మరో వజ్రాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సంస్థ. మరి భారత్ వ్యాపారులు పంపిన ఈ బహుమతిలై డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Published on: Jan 24, 2025 02:29 PM