Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీకి..ట్రంప్ అదిరిపోయే గిఫ్ట్! వీడియో

ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీకి..ట్రంప్ అదిరిపోయే గిఫ్ట్! వీడియో

Samatha J

|

Updated on: Jan 24, 2025 | 2:25 PM

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పగ్గాలు చేపట్టి డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తుపాకీ బుల్లెట్‌ నుంచి తన ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ ఏజెంట్ సీన్ కరన్‌ కు మంచి పదవి కట్టబెట్టారు. అతడిని ఏకంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. గతేడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ట్రంప్‌ రక్షణలో కరన్‌ కీలకంగా వ్యవహరించారు.

గతేడాది పెన్సిల్వేనియాలోని ఓ సభలో ట్రంప్ ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది. దీంతో ఆయనకు గాయమైంది. ఆ సమయంలో కరన్ అక్కడే ఉండి ట్రంప్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాల్పుల సమయంలో ట్రంప్ పిడికిలి బిగించి కనిపిస్తున్న ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని కుడివైపున ఉన్న వ్యక్తే కరన్. కరన్‌కు సీక్రెట్ సర్వీసెస్‌లో 23 ఏళ్ల అనుభవం ఉంది. చాలా కాలంగా ట్రంప్ వ్యక్తిగత భద్రతా అధికారిగా కరన్ కొనసాగుతున్నారు. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినపుడు కరన్ ప్రెసిడెన్సియల్ ప్రొటెక్టివ్ విభాగానికి అధిపతి అయ్యారు.
సీన్ కరన్ గొప్ప దేశభక్తుడు అంటూ ట్రంప్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో నన్ను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరన్ తన ధైర్యాన్ని నిరూపించుకున్నారు. అతడు కొన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. యునైటెడ్ సీక్రెట్ సర్వీసెస్‌లోని ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు కరన్ సమర్థవంతంగా నాయకత్వం వహించగలడని నమ్ముతున్నా. యునైటెడ్ సీక్రెట్ సర్వీసెస్‌ను మునుపటి కంటే బలోపేతం చేయగలడని విశ్వసిస్తున్నా అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.