Solar Storm: భూమికి త్వరలో ముప్పు.. అదే జరిగితే ఇంటర్నెట్ బంద్.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు(వీడియో).
సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల సౌర తుపాను దాటేసిందన్న కథనాలు వెలువడుతున్నాయి.
సౌర తుపాను వచ్చేస్తోంది.. కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం అంటూ గత కొన్ని రోజులుగా భూమికి దడ పుట్టిస్తున్న ప్రచారం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల సౌర తుపాను దాటేసిందన్న కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పందించిన శాస్త్రవేత్తలు ఇలాంటి పుకార్లు ఉత్తవేనని తేల్చి చెప్పారు. భూమికి సౌర తుపాను ముప్పు పొంచి ఉందని.. అది జరిగితే ఇంటర్నెట్ ఆగిపోయి కోలుకోలేని నష్టం చవిచూడాల్సి వస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్‌కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి చెబుతున్నారు.
సౌర తుపానుల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థపై ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. జీపీఎస్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు మొత్తం ఇంటర్‌నెట్ వ్యవస్థ ఆగిపోయే అవకాశాలున్నాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్వ్యవస్థ ఆ సమయంలో లేదు. అందుకే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సిగ్‌కామ్ 2021 పేరుతో జరిగిన డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్‌లో సౌర తుపానుల మీద అబూ జ్యోతి సమర్పించిన ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సౌర తుపాన్ గనుక భూమిని తాకితే.. ఆ ప్రభావంతో గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోనుందని ఆమె అంటున్నారు. అయితే ఈ వాదనతో పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు సైతం అంగీకరించడం ఆందోళనకు గురి చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Paralympics video: అంగవైకల్యం అతని ముందు తలొంచింది.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు..(వీడియో)
Viral Video: దక్షిణ ఆస్ట్రేలియాలో అద్భుత లోకం..! ఇది గ్రాఫిక్స్ కానే కాదు.. సరస్సు వీడియో…
Taliban Video: పంజ్‌షేర్ లోయలో వార్ వన్ సైడ్.! వందలాది మంది తాలిబన్లు మృతి…