Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics video: అంగవైకల్యం అతని ముందు తలొంచింది.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు..(వీడియో)

Tokyo Paralympics video: అంగవైకల్యం అతని ముందు తలొంచింది.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 05, 2021 | 5:45 PM

ఆత్మ విశ్వాసం ముందు.. వైకల్యం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. చైనాకు చెందిన స్విమ్మర్ జెంగ్‌ టావో టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో రికార్డులు సృష్టించాడు. ఆ దేశానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి పెట్టాడు.

ఆత్మ విశ్వాసం ముందు.. వైకల్యం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. చైనాకు చెందిన స్విమ్మర్ జెంగ్‌ టావో టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో రికార్డులు సృష్టించాడు. ఆ దేశానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి పెట్టాడు. స్విమ్మింగ్‌లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది పూర్తిగా రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్‌ టావో నాలుగు బంగారు పతకాలు సాధించి క్రీడా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు.

రియో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించాడు జెంగ్‌ టావో. చిన్నతనంలో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన జెంగ్‌ టావో.. అంగవైకల్యం శరీరానికే కాని, మనస్సుకు కాదని… లక్ష్యంతో ముందుకు వెళ్లిన తీరు స్ఫూర్తిదాయకం. చేతులు కోల్పోయినా కుంగిపోకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాడు. ఈ రోజు ప్రపంచ చరిత్రలో తన పేరును లిఖించుకుని అద్భుతమే చేశాడు. సెప్టెంబర్‌ 1న జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్‌లో విజయం సాధించగానే.. చైనీయులు జెంగ్‌ టావోపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు. ఎందుకంటే 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో మొదలైన చైనా బంగారు పతకాల వేట సెప్టెంబర్‌ 1 నాటికి 500 కు చేరింది. ఆనతరం మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన జెంగ్‌ టావో… ”నా చిట్టితల్లీ.. చూడు నాకు రెండు చేతులు లేనప్పటికీ నేను చాలా వేగంగా ఈత కొట్టగలను” అంటూ తన కుమార్తెకు వీడియో సందేశాన్ని పంపాడు.

జెంగ్.. టోక్యో పారాలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతిరోజూ కనీసం 10 కిలోమీటర్లు ఈత కొడుతూ ప్రాక్టీస్‌ చేసేవాడు. 13 సంవత్సరాల వయస్సులో స్విమ్మింగ్‌పై ఆసక్తి పెంచుకున్న జెంగ్‌ టావో పందొమ్మిదేళ్ల వయస్సులో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటిల్లో అరంగేట్రం చేశాడు. తరువాత 2012 లండన్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో తన మొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది పారాలింపిక్ పతకాలు జెంగ్‌ టావో సాధించాడు. 
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: దక్షిణ ఆస్ట్రేలియాలో అద్భుత లోకం..! ఇది గ్రాఫిక్స్‌ కానే కాదు.. సరస్సు వీడియో…

Taliban Video: పంజ్‌షేర్‌ లోయలో వార్‌ వన్‌ సైడ్‌.! వందలాది మంది తాలిబన్లు మృతి…

Prakash Raj: వార్ వన్ సైడేనా..? మా పై ప్రకాష్ రాజ్ స్పందన.. తెరపై దుమారం రేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్..(లైవ్ వీడియో).

చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.