నత్త నడకన ఇంటర్నెట్‌ స్పీడ్‌ !! లక్షలాది మంది యూజర్లపై ప్రభావం

పాకిస్థాన్‌ ప్రజలకు ఇంటర్నెట్‌ కష్టాలు మొదలయ్యాయి. వాట్సాప్‌ సందేశాలు, ఈ-మెయిల్స్‌ మొదలు.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ల వరకు ఏ ఒక్కటీ టైమ్‌కి పూర్తికాని దుస్థితి. కారణం.. ఇంటర్నెట్‌ స్పీడ్ తగ్గడమే! లక్షలాది మంది ఇంటర్నెట్‌ యూజర్లపై దీని ప్రభావం పడుతోంది. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. కొన్నిరోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపణలూ వస్తున్నాయి.

నత్త నడకన ఇంటర్నెట్‌ స్పీడ్‌ !! లక్షలాది మంది యూజర్లపై ప్రభావం

|

Updated on: Aug 24, 2024 | 12:23 PM

పాకిస్థాన్‌ ప్రజలకు ఇంటర్నెట్‌ కష్టాలు మొదలయ్యాయి. వాట్సాప్‌ సందేశాలు, ఈ-మెయిల్స్‌ మొదలు.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ల వరకు ఏ ఒక్కటీ టైమ్‌కి పూర్తికాని దుస్థితి. కారణం.. ఇంటర్నెట్‌ స్పీడ్ తగ్గడమే! లక్షలాది మంది ఇంటర్నెట్‌ యూజర్లపై దీని ప్రభావం పడుతోంది. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. కొన్నిరోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపణలూ వస్తున్నాయి. పాకిస్థాన్‌లో 11 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు సగం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సోషల్ నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దాంతో ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాపై పాకిస్థాన్‌ ఉక్కుపాదం మోపింది. అప్పటినుంచి వాటి వినియోగం విషయంలో నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్‌ పడిపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకు 7 గంటలే పని చేయండి !! రోజుకు రూ.28 వేలు జేబులో వేసుకోండి

కారు లైట్ ఇలా ఆపి అలా వెయ్యగానే.. ఏం కనిపించిందో తెలుసా ??

ఆవుకు తులాభారం !! ఆ నాణేలను ఏం చేశారంటే ??

Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??

రేపిస్టులను ఏ దేశంలో ఎలా శిక్షిస్తారు ??

Follow us