ఆవుకు తులాభారం !! ఆ నాణేలను ఏం చేశారంటే ??
హిందువులు ఆవును గోమాతగా, సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటం.. లక్ష్మీస్వరూపంగా భావించే గోమాతకు తులాబారం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు కొందరు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవం గా నిర్వహించారు.
హిందువులు ఆవును గోమాతగా, సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటం.. లక్ష్మీస్వరూపంగా భావించే గోమాతకు తులాబారం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు కొందరు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవం గా నిర్వహించారు. కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మండలంలోని బొలెద్దుపాలెం గ్రామంలో స్థానిక రామాలయం వద్ద గ్రామస్తుల సహకారంతో ఈ గోధన తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు లక్షా ముప్పైవేల విలువ గల చిల్లర నాణాలతో గోమాతకు తులాబారం కార్యక్రమం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి 11 చిల్లర నాణాల వంతున సేకరించి, ఈ మహాక్రతువులో వినియోగించారు. ఈ కార్యక్రమంలో స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలవారు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాతపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు శ్రావణమాసపు పౌర్ణమి రోజున తమ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, హిందూ తత్త్వం మరింత ప్రజలకు చేరువవుతుందని తెలిపారు. గోమాత తులా బారంతో లక్ష్మీదేవి కృపకు తామంతా పాత్రులమయ్యామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

