కారు లైట్ ఇలా ఆపి అలా వెయ్యగానే.. ఏం కనిపించిందో తెలుసా ??

కారు లైట్ ఇలా ఆపి అలా వెయ్యగానే.. ఏం కనిపించిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Aug 24, 2024 | 12:21 PM

ఇటీవల శ్రీశైల క్షేత్రం చుట్టుపక్కల చిరుత సంచారం ఎక్కువ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ స్థానికులు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఆగస్టు 19 సోమవారం రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువ గేటు ముందు నిలుచొని ఉన్న పులిని చూసారు కొందరు భక్తులు. భక్తులు కారులో కూర్చొని చిరుతపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

ఇటీవల శ్రీశైల క్షేత్రం చుట్టుపక్కల చిరుత సంచారం ఎక్కువ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ స్థానికులు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఆగస్టు 19 సోమవారం రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువ గేటు ముందు నిలుచొని ఉన్న పులిని చూసారు కొందరు భక్తులు. భక్తులు కారులో కూర్చొని చిరుతపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, కారు లైట్లు వేసి వీడియోలు తీస్తుండగా ఆ లైట్ల వెలుతురు పడటంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలోకి చిరుత పులి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొద్ది రోజులుగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎక్కడో అక్కడ చిరుత ప్రత్యక్షమవుతూనే ఉంది. ఇక, ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు స్పందించారు.. చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆవుకు తులాభారం !! ఆ నాణేలను ఏం చేశారంటే ??

Explainer: భారత్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ !! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ??

రేపిస్టులను ఏ దేశంలో ఎలా శిక్షిస్తారు ??

TOP 9 ET News: వాట్ నాని !! పుష్ప2 మేకర్స్‌కే కౌంటరా ??