ట్రంప్‌కి మొదలైన సవాళ్లు.. డోజ్‌పై అమెరికన్ ఉద్యోగ సంఘం దావా
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నిమిషాల్లోనే ట్రంప్ కి సవాళ్లు మొదలయ్యాయి. ట్రంప్ కార్యవర్గం తొలిసారిగా ఏర్పాటు చేసిన డోజ్ కి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. ప్రమాణ స్వీకారం ముగిసిన నిమిషాల్లోనే దానిపై తొలి దావా దాఖలైంది. అమెరికాలోని అతిపెద్ద ఉద్యోగ సంఘమైన ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
అసలు అటువంటి డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయడాన్నే ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. అది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టపరమైన నిబంధనలు పూర్తి చేయలేదని పేర్కొంది. రోజువారీ అమెరికన్ల ప్రయోజనాల కోసం పనిచేయని వారు డోజీలో సభ్యులుగా ఉన్నారని దీనిలో ఆరోపించారు. వారు ప్రభుత్వ ఏజెన్సీల వ్యయనియంత్రణలను సూచిస్తుంటారని ఆ సంఘం పేర్కొంది. వాస్తవానికి ఫెడరల్ నిబంధనల ప్రకారం కమిషన్ లేదా టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి.. ప్రైవేటు రంగం నుంచి సూచనలు స్వీకరించవచ్చని గుర్తు చేసింది. మరోవైపు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్స్‌ను ఏర్పాటు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడం.. ఫెడరల్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లను ఆధునీకరించడం వంటివి దీనిలో ఉన్నాయి. దీనికి మస్క్‌ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. డోజ్ సభ్యులను కూడా కేటాయించేలా ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: చేపల పులుసు వండి వడ్డించిన నాగ చైతన్య
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన
మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

