విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన
ఎట్టకేలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మంచిరోజులొచ్చాయి. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 11 వేల 440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటన చేశారు. ఏపీతో పాటు దేశానికి ఎంతో కీలకమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ప్యాకేజ్‌తో మళ్లీ పుంజుకుంటుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం..గత కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అందుకు కారణమని స్టీల్‌ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం.. ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం..పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో చర్చలు జరిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ
అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఇక లేనట్టే!
వ్యాయామం చేసిన తర్వాత ఇవి అసలు తినకూడదు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

