మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ
మహా కుంభమేళాలో ఇప్పటి వరకు గంగానదిలో పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. మౌని అమావాస్య నాడు జరిగే ప్రధాన అమృత స్నాన మహోత్సవం సందర్బంగా మహాకుంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాకు వెళ్లారు.
అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌతమ్ అదానీ జనవరి 21న ఉదయమే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా ఇస్కాన్ టెంపుల్‌ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ క్యాంపులో అదానీ తన వంతు సేవలు అందించారు. ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి ప్రసాదం తయారీ సేవలో పాల్గొన్నారు. గౌతమ్ అదానీ ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదానీ గ్రూప్ సహకారంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో కుంభమేళ యాత్రీకులకు మహాప్రసాదం పంపిణీ చేస్తోంది. గౌతమ్ అదానీతో పాటు ఆయన కుటుంబం కూడా మహాకుంభ్‌లో పాల్గొంది. ఇస్కాన్ కిచెన్‌లో ప్రసాదం తయారీలోనూ సహాయం చేసింది. అనంతరం గౌతమ్ అదానీ వీఐపీ బోట్‌లో సంగంలో పర్యటించి, బడే హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అదానీ గ్రూప్ బ్యాటరీతో నడిచే గ్రీన్ గోల్ఫ్ కార్ట్ సేవలను ప్రారంభించింది. ఈ సేవ కుంభమేళా సైట్‌లోని సెక్టార్ 19లో స్థాపించిన ఇస్కాన్ కేంద్రానికి సమీపంలో అందుబాటులో ఉంది. భక్తులను వారి నిర్దేశిత ప్రదేశాలకు చేర్చేందుకు ఈ రైలు ఉదయం 6 గంటల నుండి అర్థరాత్రి వరకు పనిచేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఇక లేనట్టే!
వ్యాయామం చేసిన తర్వాత ఇవి అసలు తినకూడదు
స్పామ్ కాల్స్ ఆటకట్టు, సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం
ట్రంప్ ర్యాపిడ్ ఫైర్.. వరుస ఆదేశాలు..
ఆర్జీకర్ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్లో ఫెయిత్ హౌస్..!

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో

విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో

సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..

వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో
