స్పామ్ కాల్స్ ఆటకట్టు, సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మోసపూరిత కాల్స్, స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు. వారికి తెలియకుండానే వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయం అవుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం శాఖ ఈ మోసపూరిత కాల్స్, సందేశాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ యాప్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా అనుమానిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు వచ్చిన సమయంలో కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా వారి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. తమ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్.. చోరీకి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ సాయంతో గుర్తించవచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ ర్యాపిడ్ ఫైర్.. వరుస ఆదేశాలు..
ఆర్జీకర్ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

